నాశిక్ - నాడు ...నేడు

నాసిక్ పట్టణం మహారాష్ట్ర లో కలదు. దీనిని ఇండియాకు వైన్ రాజధానిగా చెపుతారు. ఈ ప్రదేశంలో ద్రాక్ష పంటలు పుష్కలంగా ఉండటంచే దీనికి ఈ పేరు వచ్చింది. ఇది ముంబై కి 180 కి.మీ.ల దూరంలోను పూనేకు 200 కి.మీ.ల దూరంలోను కలదు. నేపా వ్యాలీ పడమటి కనుమలలో కలదు.  నాసిక్ మొదటిలో శాతవాహన రాజుల రాజధానిగా ఉండేది. 16వ శతాబ్దంలో ఈ పట్టణం మొగల్ రాజుల పాలనలోకి వచ్చి గుల్షనాబాద్ అని పిలువబడింది. వారి చేతులనుండి పీష్వాల చేతుల్లోకి వెళ్ళి వారినుండి 19వ థతాబ్దంలో బ్రిటీష్ పాలకులకు వశం అయింది. ఖ్యాతి గాంచిన స్వాతంత్ర పోరాట యోధులు వీర సావర్కర్ నాశిక్ నివాసి. శ్రీరాముడు 14 ఏళ్ళ  అరణ్య వాసం కూడా నాశిక్ లోని తపోవన్ లో  గడిపాడని చెపుతారు. ఈ ప్రదేశంలోనే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు  కోశాడని ఆకారణంగానే దీనికి నాశిక్ అనే పేరు వచ్చిందని చెపుతారు.  కాళి దాసు, వాల్మీకి తమ గ్రంధాలలో నాశిక్ గురించి పేర్కొన్నారు. 150 బి.సి. నాటి ప్రఖ్యాత వేదాంతి అయిన ప్లోటెమీ కూడా నాశిక్ గురించి ప్రస్తావించాడు. నాశిక్ ప్రస్తుతం మహారాష్ట్రలో వేగంగా పెరుగుతున్న నగరం. మౌలిక వసతులు, విద్య, పరిశ్రమలు ఇంకనూ అనేక రంగాలలో నాశిక్ ఎంతో అభివృధ్ధి సాధించింది.

పవిత్ర ప్రదేశమే కాదు....ఎంతో ప్రధానమైంది కూడాను.  

త్రయంబకేశ్వర దేవాలయం నాశిక్ నుండి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉండి పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. దేశంలోని నాలుగు జ్యోతిర్లింగాలలో ఒకటి ముక్తి ధామంలో కలదు. ఈ దేవాలయ గోడలపై ఆకర్షణీయ రీతిలో భగవద్గీతలోని శ్లోకాలు లిఖించబడ్డాయి. ఇక్కడే కల కాలారాం దేవాలయం నల్లటి రాతితో నిర్మించబడి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.

రామాయణంలో పేర్కొనబడిన సీతా గుఫ చూసేందుకు పంచవటి సందర్శించండి. ఇక్కడే ఆసియా ఖండంలోనే ప్రసిద్ధిగాంచిన నాణేల మ్యూజియం కూడా కలదు. నాణేలు సేకరించే హాబీ కలవారికి ఈ మ్యూజియంలో శతాబ్దాలనాటి నాణేలు ప్రదర్శించబడతాయి. పక్కనే ఒక ఆర్టిలరీ సెంటర్ కూడా కలదు.  

ఈ ప్రదేశంలో కుంభ మేళా ఆచరణ ప్రధానమైనది. ప్రపంచంలోనే అతి పెద్దదిగాను వైభవోపేతంగాను జురుపుతారు. ఈ కుంభ మేళ 12 సంవత్సరాలలో నాలుగు సార్లు వస్తుంది. ఈ కుంభ మేళకు జనం తండోపతండాలుగా వస్తారు.

ఇక్కడి వసతి సౌకర్యాలు అందరికి అందుబాటులో ఉంటాయి. మూడు నక్షత్రాల హోటళ్ళనుండి అయిదు నక్షత్రాల హోటళ్ళు, ధర్మశాలలు వంటివి ఎన్నో కలవు. ఎక్కడ ఉన్నప్పటికి ఈ పట్టణ అందాలు మిమ్మల్ని మురిపిస్తాయి. నాశిక్ లో ద్రాక్ష పంట అధికం. వైన్ ఆస్వాదించేవారు సూలా వైన్ యార్డ్ తప్పక చూడాలి.    నాశిక్ గురించిన కొన్ని వాస్తవాలు జాతిపిత మహాత్మ గాంధీ నాశిక్ పట్టణం నుండే తన అహింసా ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఊహించని రీతిలో విజయం సాధించాడు. అదే బాటలో డా. బి.ఆర్. అంబేడ్కర్ వెనుకబడిన తరగతుల వారికి మద్దతుగా అస్పృశ్యతా ఉద్యమాన్ని ప్రారంభించి  విజయం పొందాడు.

నాశిక్ వాతావరణం ఉష్ణమండల వాతావరణమే. కనుక వేసవులు అధిక వేడి. ఈ కారణంగా పర్యాటకులు వేసవిలో తక్కువగా ఉంటారు. చల్లని శీతాకాలాలు ఈ పట్టణ సందర్శనకు అనుకూలం. వర్షాకాలాలు సైతం సందర్శనకు అనుకూలమే.  నాశిక్ పట్టణం దేశానికి నడిబొడ్డున ఉండటంతో దేశంలోని ఏ భాగం నుండి అయినా తేలికగా సత్వరమే చేరుకోవచ్చు. విమానాలు, రైలు స్టేషన్లు కలిగి దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, పూనే, హైదరాబాద్, బెంగుళూర్ లకు చక్కగా కలుపబడి ఉంది. ఇది ప్రధాన స్టేషన్. రోడ్డు మార్గంలో కూడా అనేక దార్లు కలవు. ప్రభుత్వ మరియు ప్రయివేట్ బస్ లు ఎన్నో ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలో కలవు.

Please Wait while comments are loading...