Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» మల్షేజ్ ఘాట్

మల్షేజ్ ఘాట్ – ప్రకృతి స్వర్గం

13

మహారాష్ట్ర లోని పూణే జిల్లాలో వున్న పశ్చిమాద్రి కనుమల్లో వున్న కొండ ప్రాంతం మల్షేజ్ ఘాట్.

సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తున వున్న ఆసక్తి కరమైన పర్యాటక కేంద్రం మల్షేజ్ ఘాట్ సమంగా వుండే, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి వుంటుంది. లెక్కలేనన్ని చెరువులు, కొండలు వుండే ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు, సరదా రాయుళ్ళకు, సాహాసికులకు, పర్వతారోహకులకు ఒకేలా ఆనందం కలిగిస్తుంది.

పచ్చని గ్రామాన్ని తలపించే మల్షేజ్ ఘాట్ ను - దీని గుండా ప్రవహించే నదులు, దేశ సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబించే చారిత్రిక కోటలు, వర్షాకాలంలో స్వాగతం పలుకుతున్నట్టు ఉండే ఇక్కడి జలపాతాలు, అభాయారణ్యాల్లో అందమైన పుష్పాలు, వివిధ వృక్ష జాతులు ప్రత్యేకంగా కనబడతాయి.

ఇక్కడి ప్రధాన ఆకర్షణలు

వర్షాకాలం లో మల్షేజ్ ఘాట్ చక్కని విహార కేంద్రం. సాధారణ ప్రకృతి షికార్లు కూడా మబ్బుల్లో విహరిస్తున్నట్టు స్వర్గతుల్యమైన అనుభవం అందిస్తుంది. ఈ ఎత్తులో దట్టంగా వుండే మబ్బులు మీకు వాటి లోంచి నడుస్తున్న అధివాస్తవిక అనుభూతిని ఇస్తాయి.

పక్షి ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు, మిలమిలలాడే నది నీరు, పచ్చని మైదానాల నేపధ్యంలో ఇక్కడి పిమ్పల్గావ్ జాగా డ్యాం కి వచ్చే వలస పక్షులను చూడడానికి ఇష్టపడతారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్లెమింగో పక్షులను చూడడం మరిచిపోకండి.

వాస్తుశాస్త్ర ఔత్సాహికులకు ఇక్కడి అజోబా పర్వత కోట, జివ్ధాన్ చావాండ్ కోట, హరిశ్చంద్ర గడ కోట బాగా నచ్చుతాయి. శివాజీ మహారాజు జన్మస్థలంగా ప్రసిద్ది చెందిన శివనేరి కోట ఇక్కడి మరో ప్రధాన ఆకర్షణ. పర్వతారోహణ లాంటి ఇతర కార్యక్రమాలకు ఇక్కడ అవకాశం వుంది.

మల్షేజ్ ఘాట్ లో పర్యాటకులను ప్రతి ఏటా రప్పించే చాలా ఆకర్షణలు, కార్యకలాపాలు వున్నాయి. ఇది తన పర్యాటకుల మీద ప్రయోగించే మాయ తెలియాలంటే ఇక్కడికి రావాల్సిందే.

మల్షేజ్ ఘాట్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మల్షేజ్ ఘాట్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మల్షేజ్ ఘాట్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మల్షేజ్ ఘాట్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం మల్షేజ్ ఘాట్ మహారాష్ట్ర లోని అన్ని ప్రధాన నగరాలకు ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల ద్వారా కలపబడి వుంది. ఈ బస్సులు ముంబై, పూణే, కళ్యాణ్ లాంటి నగరాలకు మల్షేజ్ ఘాట్ కు మధ్య నిత్యం తిరుగుతాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం మల్షేజ్ ఘాట్ కు దగ్గరగా వుండే రైల్వే స్టేషన్ కళ్యాణ్. ఈ స్టేషన్లు మహారాష్ట్ర లోపల, వెలుపల వున్న అన్ని ప్రధాన నగరాలకు నిత్యం నడిచే రైళ్లతో కలపబడి వుంది. కళ్యాణ్ స్టేషన్ మల్షేజ్ ఘాట్ నుంచి 86 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి స్టేషన్ నుంచి గంటన్నర పడుతుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    మల్షేజ్ ఘాట్ – ఎలా చేరుకోవాలి వాయుమార్గం 150 కిలోమీటర్ల దూరంలోని ముంబై లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడికి దగ్గర. ఇక్కడి నుంచి దేశంలోనూ, విదేశాలలోనూ వున్న అన్ని ప్రధాన నగరాలకు నిత్యం విమాన సేవలు అందుబాటులో వున్నాయి. ముంబై విమానాశ్రయం సింగపూర్, న్యూ యార్క్ లాంటి నగరాలకు కలపబడి వుండడం వల్ల విదేశాల నుంచి వచ్చే వారికి చాలా సౌకర్యంగా వుంటుంది. ఇక్కడి నుంచి మల్షేజ్ ఘాట్ వెళ్ళడానికి విమానాశ్రయం బయట నుంచి సుమారు 3000 రూపాయల చార్జీ తో టాక్సీలు దొరుకుతాయి. నాశిక్ లోని గాంధీనగర్, పూణే లోని లోహేగావ్ దేశీయ విమానాశ్రయాలు ఇక్కడికి దగ్గరలోనే వున్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 May,Sun
Check Out
01 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon