పూణే – పుణ్య నగరం

మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో, సముద్ర మట్టానికి 560  మీటర్ల ఎత్తున వున్న మహా నగరం పూణే. ‘పుణ్యనగర’ అనే పేరు నుంచి ‘పూణే’ పేరు వచ్చింది – అంటే పుణ్యాల నిలయం అని అర్ధం. రాష్ట్రకూట రాజులు ఈ నగరాన్ని పుణ్య-విషయ అనీ, పూనక్-విషయ అని వ్యవహరించేవారు.

పూణే – గతంలోకి పయనం :

ఒకప్పుడు పూణేవాడిగా  పిలవబడిన ఇప్పటి పూణే ఒకప్పుడు గొప్ప మరాఠా రాజు ఛత్రపతి శివాజీ నివాసం ఉన్న ఊరు. తర్వాతి కాలం లో శక్తివంతమైన పీష్వా రాజ్యానికి, తత్ఫలితంగా భారత రాజకీయ కార్యకలాపాలకు ప్రధాన బిందువుగా మారింది పూణే. బ్రిటీష్ వాళ్ళు చేజిక్కించుకున్నాక వారి ‘వర్షాకాలపు రాజధాని’ అయింది.

యాత్రికులకు పూణే ఏమి అందిస్తుంది?

భవన నిర్మాణ ప్రియులు ఆగా ఖాన్ పేలస్, షిండే చత్రి, పాత సిన్హగడ్ కోట చూడ్డానికి ఇష్టపడతారు. ఒకప్పుడు పీశ్వాలకు చెందినా శనివార్ వాడ ఈ రోజు దురదృష్టవశాత్తు శిధిలం ఐపోయింది.

రజనీష్ ఓషో స్థాపించిన ఓషో కమ్యూన్ ఇంటర్నేషనల్ ఇక్కడి ప్రధాన ఆకర్షణ – ఇక్కడ ధ్యానం నేర్పిస్తారు. దగ్గర లోని కర్లా, భాజాలలో వుండే బౌద్ధ గుహలు కూడా చూడతగినవి. కేవలం రాళ్ళతో కట్టిన, అతి ప్రాచీనమైన పాతాళేశ్వర్ దేవాలయం చాల దేవతల శిల్పాలు విగ్రహాలతో నిండి వుంటుంది. ఈ దేవాలయం 1400  సంవత్సరాల క్రితం కట్టినది!

కేవలం విశ్రాంతి తీసుకోవడానికి గాని లేదా మీ కుటుంబంతో ఓ చక్కని సాయంత్రం గడపడానికి గాని, సరస్ బాగ్, బండ్ గార్డెన్స్ వుండే ఎమ్ప్రేస్స్ బొటానికల్ గార్డెన్స్ చాల చక్కని ప్రదేశం.

పూణే లో వుండగా పురాణ్ పోలి, పితల, చాట్, పావ్ భాజీ, సుప్రసిద్ధ మసాల్ పావ్ లాంటి స్థానిక రుచులు చూద్దాం మర్చిపోకండి. చివరి పదార్ధం మీ నోటికి కారంగా అనిపించినా ఈ రుచికరమైన వంటకం మరి కాస్త తినాలని నోరూరుతుంది. ఇక్కడి సంప్రదాయ వంటకాల్లో దాదాపుగా అన్నిట్లో ఎక్కువగా వాడేవి జొన్నలు, సజ్జలు ఉపయోగిస్తారు.

డిసెంబర్ లో పూణే సందర్శించేటట్లయితే  ప్రతి ఏటా జరిగే శాస్త్రీయ సంగీత మహోత్సవం ‘సవాయి గాంధర్వ సంగీత మహోత్సవాన్ని చూడండి.  

మరిన్ని వివరాలు :

ఏడాది పొడవునా ప్రయాణించడానికి పూణే లో వాతావరణం అనుకూలంగా వుంటుంది. ఇక్కడి ఉష్ణ మండల వాతావరణం వల్ల మరీ వేడిగా గాని, మరీ చల్లగా కానీ వుండదు. పగళ్ళు వేడిగా వుంటాయి కాబట్టి ఇక్కడి వేసవి భరించడం సవాలే, కానీ రాత్రి వేలల్లో ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు పడిపోయి పరిసరాలు చల్లగా ఆహ్లాదంగా మారి పొద్దుటి బాధను తగ్గిస్తాయి. వర్షాలతో అన్నీ పచ్చగా క్రొత్తగా అనిపించడం వల్ల వర్షాకాలంలో పూణే చూడ్డానికి చాలా బాగుంటుంది. కానీ పూణే చూడ్డానికి చలికాలం అత్త్యుత్తమం, ఇదే రద్దీగా వుండే కాలం కాబట్టి అప్పుడు వసతి కొద్దిగా ప్రియంగా మారుతుంది.

మహారాష్ట్రలోని అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటి కావడం వల్ల, ఇటు రాష్ట్రంలోని, అటు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రధాన నగరాలన్నిటికీ పూణే బాగా అనుసంధానం చేయబడింది. పూణేలోని లోహేగావ్ విమానాశ్రయానికి ముంబై, డిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, కొల్హాపూర్ లాంటి నగరాల నుంచి నిత్యం విమాన సేవలు అందుబాటులో వున్నాయి. రైల్వే స్టేషన్ నుంచి ఊరి మధ్యకి కేవలం 10  కిలోమీటర్ల దూరం వుంటుంది. రైల్లో వెళ్ళాలనుకుంటే, ముంబై నుంచి బయలుదేరి 153 కిలోమీటర్ల దూరాన్ని కొద్ది గంటల్లోనే చేరుకునే శతాబ్ది ఎక్స్ ప్రెస్ లాంటి చాలా రైళ్ళు వున్నాయి. రోడ్డు ద్వారా అయితే ముంబై – పూణే రహదారి ఓ పరోక్ష వరం లాంటిదేనని చెప్పాలి – ఎందుకంటే ప్రయాణ సమయాన్ని అది కనీసం రెండు గంటలు తగ్గిస్తుంది.

మహారాష్ట్ర కు సాంస్కృతిక రాజధాని అయిన పూణే, విద్య, మౌలిక సదుపాయాల కేంద్రంగా కూడా అభివృద్ది చెందుతోంది. శాస్త్రీయ సంగీతం, నాటకం, సాహిత్యం (ముఖ్యంగా మరాఠీ సాహిత్యం), ఆధ్యాత్మికత – పూణే లో వున్నప్పుడు ప్రతి వారు ఆస్వాదించే వాటి లో కొన్ని. విద్య, ఉద్యోగ అవకాశాల కోసం దేశం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి నిత్యం వస్తూ వుంటారు. పూణే చాల వేగంగా IT  కేంద్రంగా  కూడా రూపొందుతోంది.

గామ గ్లోబల్ నగరంగా పూణే నగరానికి ప్రతిష్టాత్మకమైన గుర్తింపు వుంది.

ఇన్ని ప్రత్యేకతలు ఉన్న పూణే నగరాన్ని మీరు భారత దేశంలోను, అందునా మహారాష్ట్రలో వుంటే తప్పక చూడాలి. ఇక్కడ కావాల్సిన హంగులన్నీ వున్నాయి, ఇది మెట్రో నగరంగా మారడంలో ముంబైని చాల వేగంగా అనుసరిస్తోంది. సంస్కృతి, సాంకేతిక పరిజ్ఞానం, చరిత్ర, మౌలిక వసతులు – వీటన్నిటి కలబోత అయిన పూణే నగరాన్ని సందర్శించండి. ఇలాంటి భిన్నత్వం చూడాల్సిందే, చూసి తీరాల్సిందే.

Please Wait while comments are loading...