ఓషో ఆశ్రమం, పూణే

పూణే లోని కోరేగావ్ పార్క్ లో భగవాన్ రజనీష్ ఓషో – ఈ ఓషో ఆశ్రమాన్ని నిర్మించారు. 32 ఎకరాల సువిశాల స్థలంలో ఉన్న ఈ ధ్యాన కేంద్రం ఓషో సిద్ధాంతాలు, ప్రబోధాలు నమ్మే వారందరికీ స్వాగతం పలుకుతుంది.శరీరాన్ని, ఆత్మని మానసికంగాను, ఆధ్యాత్మికంగాను ఉద్ధరించేందుకు ఇక్కడ చాల కార్యక్రమాలు జరుగుతాయి.

ఓషో నటరాజ్ ధ్యానం, ఓషో డైనమిక్ ధ్యానం, ఓషో కుండలినీ ధ్యానం ఇక్కడ నేర్పించే ధ్యాన ప్రక్రియల్లో కొన్ని.ఉదయం పూట తోపు రంగు దుస్తులు, రాత్రి ప్రార్ధనకి తెల్లటి దుస్తులు ఇక్కడి నియమం. ఏడాది పొడవునా తెరిచే వున్నప్పటికీ, ఇక్కడ వసతి సౌకర్యం మాత్రం దొరకదు.కమ్మ్యూన్ కి దగ్గర లో వున్నా నల్లా పార్క్ చాల పెద్దది.

Please Wait while comments are loading...