రత్నగిరి - కోస్తాతీర ప్రాంతం

చారిత్రక ప్రాధాన్యతరత్నగిరి మహారాష్ట్రలో నైరుతి దిశగా, అరేబియా మహా సముద్రం ఒడ్డున ఉన్న ఒక అందమైన కోస్తా తీర పట్టణం. చిన్న పట్టణం అయినప్పటికి ఎంతో అందమైన ఓడరేవు పట్టణం.  భారతదేశంలోని ఈ ప్రాంతంలో శివాజీ మహారాజు పాలన తర్వాత, రత్నగిరిని క్రీ.శ.1731 సం. ప్రాంతంలో పాలించిన సాతర్ రాజుల పాలనలో ఉండేది. దీనిని బ్రీటీష్ వారు క్రీ.శ. 1818 సంవత్సరంలో  స్వాధీనం చేసుకున్నారు.

పురాణ గాధ అయిన మహాభారతం మేరకు పాండవులు వారి అరణ్య వాసం తర్వాత  రత్నగిరి లో కొంతకాలం నివసించారు. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు పాండవులతో సహకరించి కౌరవులతో పాండవులు చేసిన యుద్ధంలో వారికి వ్యక్తిగతంగా కౌరవులతో యుద్ధం చేశాడు.

ఆసక్తికల ఇతర ప్రదేశాలు ఏమిటి? అతి పెద్దదైన జైగడ్ కోట పర్యాటకులకు ఆసక్తి కలిగిస్తుంది.  ద్వీపకల్పం చివరి భాగంలో ఉన్న రత్నగిరిలోని ఈ కోట చూసేందుకు అమిత ఆకర్షణ కలిగి ఉంటుంది. సమీపంలోనే జైగడ్ లైట్ హౌస్ కూడా ఉంటుంది. దీనికి దగ్గరలోనే రత్న దుర్గ కోట ఉంటుంది. ఇది సుమారు 600 సంవత్సరాల క్రిందటిది.  బీచ్ ల పట్ల మీకు ఆసక్తి ఉన్నట్లయితే, ఈ ప్రాంతంలో మీకు అనేక బీచ్ లు కనపడతాయి. మండావి బీచ్ నల్లని ఇసుకతో ఆశ్చర్య పరుస్తుంది. గణపతి పూలే బీచ్ మరియు గణేష్ గులే బీచ్ లు కూడా చూసి ఆనందపడవచ్చు.

గణపతి పూలే బీచ్ సమీపంలో పురాతన స్వయంభూ గణపతి దేవాలయం కలదు. ఈ పుణ్యక్షేత్రం సుమారు 400 సంవత్సరాల క్రిందటిది. ఎంతో మహిమకల దేవాలయంగా చెపుతారు.  రత్నగిరి సందర్శించేవారు ఇక్కడి స్ధానిక ఆహార రుచులు తప్పక తిని ఆనందించాల్సిందే. చేప కూరలు కోకం కర్రీ వంటివి స్ధానికులు బాగా తయారు చేస్తారు.  వేసవిలో కనుక మీరు ఈ ప్రాంతం సందర్శించగలిగితే, రత్నగిరి మామిడి పండ్లు తప్పక రుచి చూడాలి. వివిధ రకాల మ్యాంగో రసాలను మీ వెంట కూడా తీసుకు వెళతారు.

మీరు షాపింగ్ ప్రియులైతే,  రత్నగిరి లో షాపింగ్ అద్బుతంగా ఉంటుంది. పురాతన చేతి కళా వస్తువులనుండి నేటి ఆధునిక వస్తువుల వరకు ఎన్నోమీకు అందుబాటులో ఉంటాయి.

రత్నగిరి ఎలా మరియు ఎపుడు సందర్శించాలి? వేసవిలో రత్నగిరి వేడిగా ఉంటుంది. సందర్శన కష్టం అవుతుంది. ఈ సమయంలో ప్రయాణాలు రద్దు చేసుకోవటం మంచిది.  రత్నగిరి మామిడి పండు రసాలను ఆస్వాదించాలనుకుంటే మాత్రం వేసవిలో ఈ ప్రాంతం మీకు మంచి ఆనందాన్నిస్తుంది. వర్షాలు పడితే చాలు ఈ ప్రదేశం అద్భుతంగా గోచరిస్తుంది. అయితే శీతాకాలం ఈ ప్రాంత సందర్శనకు అనువైనది.

ప్రధాన పట్టణం అవటం వలన రత్నగిరి పట్టణానికి అన్ని రకాల రవాణా కలదు. స్ధానిక విమానాశ్రయం కూడా కలదు. రైలుపై కూడా చేరుకోవచ్చు. రత్నగిరి రైలు స్టేషన్ కొంకణ్ లైనుపై కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు పట్టణాలకు కూడా ప్రతిరోజూ రైళ్ళు ఇక్కడనుండి నడుస్తాయి. ఈ పట్టణం రోడ్డు మార్గం ద్వారా తేలికగా చేరవచ్చు. రత్నగిరి - నాగపూర్ జాతీయ రహదారి ఒక ప్రధానమార్గం ఎంతో సునాయాస ప్రయాణాన్ని చేకూరుస్తుంది.   చరిత్ర, ఆధ్యాత్మికత, ప్రకృతి, వినోదం అన్నీ కలసిన కలగూర గంప రత్నగిరి. మరాఠీయుల సంస్కృతిలో తడసి ముద్ద అయి వుంటుంది. వ్యూహాత్మకంగా నిర్మించిన వారి కోటల నైపుణ్యం నుండి ప్రశాంతమైన, అందమైన బీచ్ లు, ఈ ప్రాంతంలో దొరికే అల్ఫాన్సో మామిడి పండ్లు అన్నీ మిమ్ములను ఈ ప్రాంతంలో తప్పక కట్టి పడేస్తాయనటంలో సందేహం లేదు. ఈ ప్రదేశం తప్పక చూడదగిన ప్రదేశాలలో ఒకటి. 

Please Wait while comments are loading...