Search
  • Follow NativePlanet
Share

తపోలా – వ్యవసాయ పర్యాటకానికి సరైన ప్రదేశం

12

మహాబలేశ్వర్ పర్వత కేంద్రం నుంచి కేవల౦ 25 కిలోమీటర్ల దూరంలో వున్న ఉపగ్రహ గ్రామం తపోలా ను మహారాష్ట్ర లోని చిన్న కాశ్మీర్ గా పిలుస్తారు. ఈ చిన్న గ్రామం ప్రకృతిలోకి తిరిగి రావాలనుకునే ప్రకృతి పిపాసులకు చాలా ఇష్టమైన గ్రామం.

ఈ గ్రామానికి వెళ్తుంటే రోడ్డు కి రెండు వైపులా మనోహరమైన దృశ్యాల సమాహారంగా ప్రకృతి శోభ కనబడుతుంది. చాలా ఆసక్తికరమూ, క్లిష్టతరమూ అయిన పర్వతారోహణ అభ్యాసాన్ని అందించే ఈ ప్రాంతం పర్వతారోహకులకు ఇష్టమైన ప్రదేశం.

కాలుష్య రహితంగా వుండే తపోలా ఒక ఆహ్లాద పరిచే వాతావరణం తో ఎవరి ఇంద్రియాలనైనా తాజా పరుస్తుంది. పర్వతారోహణ చేసే వారికి, ఈ ప్రాంతాన్ని మరింత దగ్గరగా ఆస్వాది౦చాలనుకునే వారికీ ఇక్కడ చాలా కాంప్ ప్రదేశాలు వున్నాయి.

మీరు జలక్రీడల ప్రేమికులైతే, తపోలా లో 90 కిలోమీటర్ల పొడవైన శివసాగర్ సరస్సులో ఈత కొట్టవచ్చు, లేదా ప్రవాహం క్రిందికి కయాకింగ్ చేస్తూ వెళ్ళవచ్చు. మీ జలక్రీడోత్సాహాన్ని సంతృప్తి పరిచేందుకు ఇక్కడ వాటర్ స్కూటర్లు, మోటార్ బొట్లు దొరుకుతాయి.

మీకు పర్వతారోహణ ఉత్సాహాన్ని ఇస్తే, బాగా కష్టమైన, సవాల్లా వుండే వసోతా కోట ఎక్కడానికి ప్రయత్నించండి. ఇది కేవలం బొట్ ద్వారానే చేరుకోగల ప్రాంతం కాబట్టి మీకు అటవీ శాఖాధికారుల నుంచి ప్రత్యెక అనుమతులు అవసరమౌతాయి, ఇక్కడి నుంచి ఒంటరి దారిలో పైకెక్కడం బాగా కష్టమే అయినా ప్రయత్నించ దగ్గది.

మీరు సరదాగా ప్రకృతి మాత అందాలను ఆస్వాదిస్తూ ప్రకృతి వ్యాహాళి చేద్దాం అనుకుంటే, ఇక్కడి స్ట్రాబెర్రీ ఫారాలు, నర్సరీలు సందర్శించండి. వర్షాకాలం తర్వాత 150 రకాల పూల రకాల తో కప్పబడి వుండే ఇక్కడి కాస్ మైదానం చూసి తీరాల్సిందే.

తపోలా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తపోలా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తపోలా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తపోలా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ముంబై, నాశిక్, పంచగని, సతారా ల నుంచి తపోలా చేరుకోవడానికి మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చాల బస్సులు నడుపుతోంది. మీరు ఎంచుకున్న బస్సు సర్వీసుని బట్టి రేటు వుంటుంది – సాధారణంగా ఇది 75 రూపాయల నుంచి 250 రూపాయల మధ్య వుంటుంది. తపోలా కు బస్సులు నడిపే చాలా ప్రైవేట్ ఆపరేటర్లు కూడా వున్నారు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం పూణే, వాతార్ ల లోని రైల్వే స్టేషన్లు తపోలా నుంచి దగ్గర. ఇక్కడి నుంచి బయలుదేరేవి, ఇక్కడికి చేరేవి - లోకల్, బయటి రైళ్ళు కూడా నడుస్తాయి. ఈ స్టేషన్ల నుంచి తపోలా చేరుకోవడానికి టాక్సీలు కూడా దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం పూణే లోని లోహేగావ్ ఇక్కడికి దగ్గరి విమానాశ్రయం. అది ఇక్కడికి 156 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. విదేశాల నుంచి వచ్చేవారికి ముంబై లోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం ఇక్కడికి దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడి నుంచి నేరుగా తపోలా వెళ్ళడానికి అందుబాటు ధరల్లో టాక్సీ సర్వీసులు కూడా దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 May,Fri
Return On
30 May,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 May,Fri
Check Out
30 May,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 May,Fri
Return On
30 May,Sat