హరిహరేశ్వర్ - శివభగవానుడి దేవాలయం

హరిహరేశ్వర్ మహారాష్ట్రలోని రాయ్ గడ్ జిల్లలో ఒక ప్రశాంత పట్టణం. దీని చుట్టూ నాలుగు కొండలుంటాయి. వీటిపేర్లు బ్రహ్మాద్రి, పుష్పాద్రి, హర్షిణాచల్ మరియు హరిహర్. హరిహరేశ్వర్ కోంకణ్ ప్రాంతంలోని పచ్చని అడవులు ఒకవైపునా, అందమైన బీచ్ లు మరో వైపునా కలిగి ఉంది.  హరిహరేశ్వర్ శివ భగవానుడి హరిహరేశ్వర్ దేవాలయానికి ప్రసిద్ధి.  సావిత్రి నది ఈ ప్రదేశంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది.  

చారిత్రక ప్రాధాన్యతహరిహరేశ్వర్ ప్రదేశ చరిత్ర పరిశీలిస్తే ఈ ప్రాంతం ఒకప్పుడు ఛత్రపతి శివాజీ క్రింద మరాఠా పాలనలో కలదు. మొదటి పేష్వా పాలకుడు బాజీరావు ఈ పవిత్ర ప్రదేశానికి 1723 లో సందర్శించినట్లు చరిత్ర చెపుతోంది.

ఇక్కడి పురాతన దేవాలయాలు, చారిత్రక నిర్మాణాల శిల్పశైలి భారతీయ శిల్ప కళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తాయి. ప్రతిదేవాలయ శిల్పాలలోను కొన్ని గాధలున్నాయి. అనేక హిందు పౌరాణిక కధలు వినవస్తాయి.  

హరిహరేశ్వర్ - ఆధ్యాత్మిక కేంద్రం

హరిహరేశ్వర్ మతపర ప్రధాన ప్రదేశం. దీనినే దక్షిణ కాశి అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో అనేక దేవాలయాలు ప్రధానంగా శివ భగవానుడు, విష్ణువు, బ్రహ్మల దేవాలయాలు కలవు. కాలభైరవ దేవాలయం మరియు యోగేశ్వరి దేవాలయాలు కూడా చూడవచ్చు.  హరిహరేశ్వర్ లో అందమైన బీచ్ ప్రాంతం కలదు. వారాంతపు సెలవులు గడిపేందుకు ఈ బీచ్ అనుకూలమైన విహార స్ధలం. సమీపంలోని పుష్పాద్రి కొండలు ఈ ప్రదేశానికి మరింత అందాలను చేకూర్చుతాయి.  హరిహరేశ్వర్ ఎందుకు దర్శించాలి? హరిహరేశ్వర్ సందర్శనకు వాయు, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా చేరవచ్చు. సంవత్సరంలో ఏసమయంలో అయినా సరే దీనిని పర్యటించవచ్చు. అయితే, వర్షాకాలం తర్వాత మరియు శీతాకాలాలలో పర్యటన ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

హరిహరేశ్వర్ ప్రతి ఏటా వేలాది భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతంలో దేవాలయాలే కాదు అనేక అందమైన బీచ్ లు ఇతర ఆకర్షణలు కూడా ఉన్నాయి. నగర జీవనంలో విసిగి వేసారిన వారికి ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతతను, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. చక్కటి వాతావరణం, అందమైన బీచ్ లు, సహజ రాతి దేవాలయాలు, అన్నిటితో హరిహరేశ్వర్ అలరారుతోంది.  

Please Wait while comments are loading...