గణపతిపులే – భారత దేశ కరేబియన్

కొంకణ్ తీరానగల మనోహరమైన రేవు పట్టణ౦ గణపతిపులే ను

భారత దేశ కరేబియన్ ద్వీపం అంటారు .ఈ ప్రాంతం ముంబైకు 375 కిలోమీటర్ల దూరంలో రత్నగిరి జిల్లాలో ఉంది. మహారాష్ట్ర లోని   

ఈ చిన్న గ్రామం వేగంగా జరుగుతున్న నగరీకరణకు దూరంగా తన సహజసిద్ధమైన రమణీయతతో ఆహ్లాదకరంగా ఉంటుంది .

మతం, సముద్ర తీరం, చరిత్ర -  అన్నీ ఒకేచోట

గణపతిపులే లోని స్వయంభు గణపతి దేవాలయం ఈ చిన్ని గ్రామానికి గొప్ప ఆకర్షణ. 400 ఏళ్ళ నాటిదని చెప్పబడే ఇక్కడి గణపతి విగ్రహాన్ని ఏకరాతి నుండి చెక్కారు. ప్రతి ఏడాది వేలాదిమంది యాత్రికులు గణపతి ఆశిస్సుల కోసం ఇక్కడకు వస్తారు. గణపతి దేవుని పశ్చిమ ద్వారదేవత అంటారు. గణపతిపులే గ్రామంలో ప్రజలు తమ క్షేమానికి కారణం ఈ దేవుని అనుగ్రహమేనని నమ్ముతారు

గణపతిపులే లోని తీరప్రాంతాలు స్వచ్చమైన నీటితో బాటు అపరిమితమైన వృక్ష సంపదను కల్గిఉన్నాయి ఈ తీరప్రాంతం వెంబడి గల  కొబ్బరి చెట్లు అనేక పొదలు  దూరం నుండి ఎంతో రమ్యంగా కనబడతాయి

ఈ ప్రాంతానికే చెందిన మరో రెండు ప్రదేశాలు రాయగడ్ కోట, రాయగడ్ లైట్ హౌస్ చూడడం మరవకండి

ఇక్కడి రుచులు ఎండు మామిడి అప్పడం అంబాపోలి, పనస అప్పడం ఫనస్పోలి తినడం మరవకండి . ప్రసిద్ధి చెందిన ఇంకో వంటకం కోకంకడి. మీరు వేసవిలో గణపతిపులే వెళ్తే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవగడ్ హపస్ మామిడి తినడం మరవొద్దు. గణపతి దేవునికి ఇష్టమైన రుచికరమైన తీపి వంటకం కుడుములు తినకుండా మీరు ఇక్కడినుండి  రాలేరు.

ఈ ప్రాంత సందర్శనలో గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు

గణపతిపులే గ్రామ ప్రజలు గొప్ప గణపతి భక్తులు, అతిధు లను చాలా మర్యాదగా చూస్తారు. ఇక్కడ మరాఠీ ఎక్కువగా వాడినా యాత్రికులు తరచూ సందర్శించే ప్రాంతమైనందున ఇంగ్లీష్, హిందీ కూడ మాట్లాడతారు.

గణపతిపులే అరేబియన్ సముద్రానికి దగ్గరగా ఉండటంవల్ల ఇక్కడి వాతావరణం చాలా అధ్భుతంగా ఉంటుంది  

వేసవి కాలం కొంత వేడిగా ఉండటం వల్ల సాధారణంగా యాత్రికులు ఈ కాలంలో రారు.

మీరు ఈ ప్రాంతాన్ని చూడాలనుకుంటే మాత్రం ఇక్కడి మనోహర మైన వాతావరణాన్ని ఆస్వాది౦చడానికి ఒక జత ఈత దుస్తులు తెచ్చుకోండి.

కానీ వర్షాకాలంలో రోడ్డు  ప్రయాణం ఈ స్వర్గంలో మైమరపించే  మరువలేని మధురానుభూతిని కల్గిస్తూ సందర్శనకు అనువుగా ఉంటుంది

పుష్కలంగా కురిసే వర్షాల వల్ల ఈ ప్రాంతం అధివాస్తవిక అందాలతో రమణీయంగా ఉంటుంది. వర్షాలంటే ఇష్టం లేనివారు శీతాకాలంలో ఈ పవిత్ర ప్రదేశాన్ని దర్శించవచ్చు .

మొదటిసారి ఇక్కడికి  వచ్చే వారికి గణపతిపులే రావడం   చాలా సులువు.

మీరు విమాన మార్గం ఎంచుకుంటే రత్నగిరి విమానాశ్రయం నుండి గణపతిపులే దగ్గరగా ఉంటుంది

రత్గిరి రైల్వే స్టేషన్ గణపతిపులేకు  చాలా దగ్గర  - ఇక్కడి నుంచి చిన్న బస్సులు  ఆటోల ద్వారా గణపతిఫులే  చేరవచ్చు

అన్నింటికంటే ఉత్తమ మైనది రోడ్డు ప్రయాణం. నిర్మలమైన ఈ చిన్న గ్రామ సౌందర్యాన్ని తిలకించడానికి రోడ్డు ప్రయాణానికి మించిందిలేదు

సామానులు సర్డుకుని ఈ చిన్న గ్రామానికి పదండి. ఇక ఎప్పటికి మరవలేని మధుర జ్ఞాపకాలు  మీ సొంతం.

Please Wait while comments are loading...