కాలన్ గూటే బీచ్ అన్నిటికంటే ప్రధాన ఆకర్షణ. కండోలిం మరియు బాగా బీచ్ ల మధ్యన కల ఈ బీచ్ పర్యాటకులకు స్వర్గం తలపిస్తుంది. ఎన్నో పార్కింగ్ ప్రదేశాలు. రుసుము చెల్లించి హాయిగా మీ వాహనం రక్షించుకోవచ్చు. బైక్ లేదా కార్ లో వచ్చి ఆనందించవచ్చు. ఇక్కడి దుకాణాలలో దుస్తులు, అనేక ఇతర వస్తువులు, చెప్పులు, గోవా మేగజైన్లు వంటివి ఎన్నో కొనుగోలు చేయవచ్చు. అన్నీ అందుబాటు ధరలలో ఉంటాయి. కాలన్ గూటే లో డ్రైఫ్రూట్లు అధికంగా లభిస్తాయి. నోరూరించే జీడిపప్పు వేపుడు, ప్లెయిన్, సాల్ట్ రుచులలో దొరుకుతుంది. కాలన్ గూటే బీచ్ నీటి క్రీడలకు ప్రసిద్ధి. బీచ్ ప్రవేశిస్తే చాలు అనేకమంది బ్రోకర్లు టికెట్లతో ప్రత్యక్షమవుతారు.
బనానా రైడ్, వాటర్ బైక్ రైడ్, పారాసెయిలింగ్, బోటింగ్ క్రీడలు ఉంటాయి. ఇక్కడనుండి విమానంలో దక్షిణంలో కల కండోలింకు లేదా ఉత్తరంలో కల అంజునాకు తేలికగా చేరవచ్చు. ఇక్కడి హోటల్ సౌజా లోబో ప్రత్యేకమైంది. దీనిలోని పీత ఎండ్రకాయలతో చేసిన వంటకాలు అమోఘ రుచి కలిగి నోరు ఊరేలా ఉంటాయి. మీరు నడిచే వారైతే సమీపంలోని బ్రిట్టోస్ లో తినండి. ఇది బాగా బీచ్ లో ఉంటుంది. నడకలో సుమారు 20 నిమిషాల సమయం పడుతుంది.
కాలన్ గూటే చూసేవారు తాజ్ వివంటా గ్రామాన్ని కూడా చూడాలతి. ఇది ఫోర్ట్ అగౌడా సమీపంలో కలదు. ఈ రిసార్టు నుండి అన్ని బీచ్ లు అంటే కాలన్ గూటే, కండోలిం, బాగా అన్నీ చూడవచ్చు. కాలన్ గూటే బీచ్ బస్ డిపో కు సమీపంగా అన్ని ప్రదేశాలకు మధ్యగా ఉంటుంది. పాణజిం లేదా ఇతర పర్యాటక స్ధలాలనుండి బస్ లేదా క్యాబ్ లలో చేరవచ్చు. లేదా స్వంత వాహనాలలో రోడ్డుపై ఉంచిన సూచనా బోర్డులు గమనిస్తూ చేరుకోవచ్చు.