మురుడేశ్వర్ - భగవాన్ శివ తో సూర్యాస్తమయం!

మురుడేశ్వర్ చరిత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోని శివ విగ్రహాలలో రెండవ ఎత్తైన విగ్రహం ఇక్కడ ఉంది. మురుడేశ్వర్ కర్నాటక రాష్ట్రంలో పశ్చిమ తీర ప్రాంతంలో ఉంది. ఈ ప్రదేశం భారత పురాణాలలో ప్రసిద్ధి చెందిన రామాయణ కాలం నాటిదని చెపుతారు. అతిపెద్ద శివ విగ్రహం పట్టణం అంతా కనపడే రీతిలో ఇక్కడి బీచ్ లో ప్రతిష్టించారు.  సుందరమైన, పచ్చటి పచ్చిక బయళ్ళతో కల ఒకచిన్న కొండపై శివుడి అతిపెద్ద విగ్రహం ప్రతిష్టించబడినది, నందీశ్వరుడితో సహా ఈ విగ్రహానికి ఒక దేవాలయం నిర్మించారు. మురుడేశ్వర్ సందర్శించేవారికి ఈ శివ దేవాలయ దర్శనం భక్తులు తమను తాము మరచిపోయే రీతిలో ఒక అత్యంత మధురానుభూతిగా ఉంటుంది.

ప్రతిష్టాత్మక శివ భగవానుడి విగ్రహంమురుడేశ్వర్ దేవాలయం ప్రధానంగా ఒక ద్వీపంలో ఉండి మూడు పక్కల అరేబియా మహా సముద్రం ప్రవహిస్తుండటంతో ఈ పుణ్య తీర్ధం దేశ విదేశాలలో  ఎంతో ప్రాచుర్యం సంతరించుకొంది. మహాసముద్ర వాతావరణం కారణంగా, అది సముద్రపు గాలి, వర్షాలు, మరియు పెను గాలులకు ప్రభావించబడింది. అతి పెద్దదైన శివ భగవానుడి విగ్రహం కొంతమేరకు దాని సహజ అందం కోల్పోయింది. దానిపై మొదట్లో గల ఆకర్షణీయమైన బంగారు పూత పోయింది. అంతే కాక విగ్రహంలోని  ఒక చేయి విరిగిపోయింది. రావణుడు తీవ్ర కోపంతో శివుడి లింగాన్ని తునకలు చేసినపుడు ఒక ముక్క ఈ ప్రదేశంలో పడటంతో, ఈ ప్రదేశంలో నిర్మించిన ఈ దేవాలయం హిందువులకు మతపరంగా ఎంతో పవిత్రత సంతరించుకొంది. దేవాలయ ప్రవేశ భాగం ప్రపంచంలోనే అతి పొడవైనదిగా ఉంటుంది.   

ఇతర ప్రధాన ఆకర్షణలు ఈ ప్రదేశంలో దేవాలయమేకాక, సందర్శకులకు అనేక ఇతర ఆకర్షణలు కూడా ఉన్నాయి.  ఇక్కడి సముద్రం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.  కనుక ఈ సముద్ర ప్రాంతంలో అందరకు  ఎంతో సంతోషపరచే  స్విమ్మింగ్, బోట్ సవారి, వంటి వివిధ వినోద చర్యలు కూడా చేసి ఆనందించవచ్చు. ఎంతో చక్కగా రూపొందించిన ప్రణాళికతో దేవాలయానికి సమీపంలోని మార్గాలు బీచ్ కు వెళ్ళేందుకు పర్యాటకులకు సంసిద్ధంగా ఉంటాయి. పర్యాటకులు అలుపూ సొలుపూ లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో ఎంతో హాయిగా మెల్లని నడక సాగిస్తూ ఈ చిన్న కొండపైనుండి అద్భుత సూర్యాస్తమయాలు చూసి ఆనందించవచ్చు.

ఈ ప్రాంతంలో యాత్రికులకు సూర్యాస్తమయం చూసి ఆనందించటం ఒక పెద్ద విశేషంగా భావిస్తారు.  పిల్లలతో వెళ్ళే కుటుంబాలు ఇక్కడి నీటి మడుగులలో గంటల తరబడి స్విమ్మింగ్ చేస్తూ ఆనందించవచ్చు. నీటిపైనే బహుళ అంతస్తుల రెస్టరెంట్లు, డైనింగ్ ప్రదేశాలు ఏర్పరచి పర్యాటకులకు మరచిపోలేని వినోదానుభూతులు కలిగించే ఏర్పాట్లు అద్భుతంగా ఉంటాయి.

ఇక్కడ అనేక హోటళ్ళు, రిసార్టులు ఎవరి బడ్జెట్ కు సరిపోయే రీతిలో వారికి లభ్యంగా ఉంటాయి. మురుడేశ్వర్ ప్రదేశం ఉత్తర కన్నడ జిల్లాలో ఉండటంతో అక్కడకల ఇతర ఆకర్షణలు కూడా మీరు చూసి ఆనందించవచ్చు. వాటిలో టిప్పు సుల్తాన్ పునర్నిర్మించిన కోట, సమీపంలోని సహ్యాద్రి కొండలపై గల హిల్ రిసార్ట్ లు, కోస్తా ప్రదేశమైన భట్కల్ వంటివి తనివితీరా చూసి ఆనందించవచ్చు. ఈ పొడవైన కోస్తాతీరం మరియు పర్వత శ్రేణుల వెంబడి ఇంకా అనేక ఇతర సహజ ఆకర్షణలున్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే అక్టోబర్ మరియు మార్చి నెలలు వాతావరణ పరంగా అనుకూలం.

ఇక్కడికి వచ్చే పర్యాటకులు భట్కల్ నుండి బోట్లను లేదా ట్రాలర్లను అద్దెకు తీసుకొని నేత్రాని ద్వీపం లేదా పిజియన్ ఐలండ్ లో గంటల తరబడి విహరిస్తారు. అయితే, గతకాలంనాటి శిధిలమైన వైభవ చిహ్నాలు మినహా ఇక్కడ మరేమీ కనపడవు. మేకలు, పక్షులు మాత్రమే విహరిస్తూంటాయి.

Please Wait while comments are loading...