శృంగేరి - భక్తులకు ఒక పవిత్ర పట్టణం

హిందూమత జగద్గురువు ఆది శంకరాచార్య తుంగనది ఒడ్డునకల ప్రశాంత పట్టణం శృంగేరి లో మొదటి మఠాన్ని స్ధాపించారు. అప్పటినుండి శృంగేరి ఒక యాత్రా స్ధలంగా వేలాది భక్తులు సంవత్సరం పొడవునా సందర్శిస్తూనే ఉన్నారు. 

శృంగేరి పట్టణ ఇతిహాస, పురాణ పూర్వాపరాలు - శృంగేరి పట్టణం ఒక వనరుల సమృధ్ధికల, పచ్చటి ప్రదేశం. ఇది కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఉంది. ఆది శంకరాచార్యులు శృంగేరి పట్టణానికి వచ్చినపుడు ఆ పట్టణంలో ఎంతో విశేషత ఆయనకు గోచరించటంతో తన మొదటి మఠాన్ని అక్కడ నిర్మించారు.

తుంగ నది ఒడ్డున పర్యటించే సమయంలో ఆయన ఒక నాగుపాము తన పడగను విప్పి మండుటెండనుండి ఒక కప్పను కాపాడటం ఆయన దర్శించారు. తన శత్రువైన కప్పకు ఆ నాగుపాము చేసిన దయనీయ చర్య శంకరాచార్యులను ఆశ్చర్య పరచింది. ఆ ప్రదేశం ఎంతో విశిష్టతగల ప్రదేశంగా ఆయన గుర్తించారు. నేడు శృంగేరి పట్టణం ఆయన స్ధాపించిన శారదా పీఠం కలిగి ప్రతిరోజూ వేలాది భక్తులను ఆకర్షిస్తోంది.   శృంగేరి లో ఇంకా చూడదగిన ప్రదేశాలు అంటే విద్యాశంకర్ మరియు శారదాంబ దేవాలయాలు. విద్యా శంకర్ దేవాలయం దాని 12 స్తంభాలకు ప్రసిద్ధి. వీటిని 12 రాశుల గుర్తులుగా చెపుతారు. ఈ దేవాలయాన్ని ఖగోళ సిద్ధాంతాలమేరకు నిర్మించారు.

శృంగేరి వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది. శృంగేరి పట్టణానికి మంగుళూరు సమీప విమానాశ్రయం. శృంగేరి పట్టణం బెంగుళూరుకు 330 కి.మీ. దూరంలో ఉండి, సౌకర్యవంతమైన బస్ సర్వీస్ కలిగి ఉంది. దీనికి సమీప రైల్వే స్టేషన్లు, షిమోగా మరియు కడూర్ లు.

Please Wait while comments are loading...