మరావంతే - ఆహ్లాదకరమైన బీచ్!

మరావంతే ఒక చిన్న పట్టణం. దీనిలో ప్రధాన ఆకర్షణ దానికిగల అందమైన బీచ్. ఈ పట్టణం దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది. పట్టణానికి కుడిభాగంలో అరేబియా సముద్రం ఎడమ భాగంలో సౌపర్ణిక నది ఉంటాయి. కుందాపుర వద్దనున్న ఈ బీచ్ ఉడుపి పట్టణానికి సుమారు 50 కి.మీ. దూరంలోను మరియు బెంగుళూరు నగరానికి 450 కి. మీ. దూరంలోను ఉంటుంది.  

ప్రశాంత జీవనం కోరేవారి స్వర్గంఈ బీచ్ ను తరచుగా వర్జిన్ బీచ్ లేదా కన్యత్వ బీచ్ అంటారు. దానికి కారణంఈ బీచ్ మైళ్ళ పొడవున ఏ మాత్రం పాడవకుండా తెల్లటి ఇసుకతో పరచబడి ఉంటుంది.  పర్యాటకులు ఎంతో ఇష్టపడే ఈ బీచ్ కొల్లూరు మరియు కొడచాద్రి కొండలకు సమీపంలో ఉంది. ఇక్కడినుండి జాతీయ రహదారి షుమారు 100 మీటర్ల దూరం మాత్రమే. కనుక మీరు బీచ్ సందర్శించటం ఎంతో తేలిక.

బీచ్ లో కల అంతు లేని ఇసుక ప్రదేశం, చల్లటి గాలినిచ్చే సముద్రం, తాటి చెట్లు వంటివి ఈ ప్రాంతంలో మీకు ఎంతో ప్రశాంతతనిచ్చి జీవితంలో మరువలేని మధుర అనుభూతులు పంచుతాయి.  ఈ బీచ్ కు దక్షిణ భాగంలో ట్రాసి అనే ప్రదేశం మరోవైపునున్న సౌపర్ణిక నదికి ఆనుకుని పడుకొనే గ్రామం ఉంటుంది.

మరావంతే పట్టణంలో కోస్తాతీర వాతావరణం ఉంటుంది. కొద్దిపాటి వేడి కొన్ని కాలాలలోను మరి కొన్ని కాలాలలో ఎంతో వేడిగాను ఉంటుంది. వేసవిలో చెమటలు అధికం. అయితే శీతాకాలం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించాలంటే సెప్టెంబర్ నుండి మార్చి వరకు అనుకూలం. సముద్రంలో స్విమ్మింగ్ చేసి ఆనందించవచ్చు. ఈ ప్రాంతంలో తుళు మరియు కన్నడం భాషలు మాట్లాడతారు.

ఈ పట్టణానికి విమాన, రైలు, రోడ్డు రవాణా సదుపాయాలున్నాయి. సమీప విమానాశ్రయం మంగుళూరు మరియు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు. మంగుళూరు విమానాశ్రయం నుండి బస్సులలో లేదా టాక్సీలలో బీచ్ చేరవచ్చు.  సమీప రైలు జంక్షన్ మంగుళూరు. ఈ బీచ్ కర్నాటకలోని ఇతర ప్రాంతాలతో బాగా కలుపబడింది. బస్సులు, ప్రయివేటు వాహనాలు తేలికగా లభ్యం అవుతాయి.

Please Wait while comments are loading...