కొల్లూరు - మాత మూకాంబిక దేవి ఆశీస్సులు 

కొల్లూరు కర్నాటకలోని కుందాపూర్ తాలూకాలో ఒక చిన్న కుగ్రామం. యాత్రికులకు ఈ స్ధలం ఎంతో ప్రత్యేకమైనది.  నిరంతరం గల గల పారే సౌపర్నికా నది  ఒడ్డున పడమటి కనుమల నేపధ్యంలో చక్కటి ప్రకృతి అందాలతో అలరించే ప్రదేశం కొల్లూరు. అక్కడి దేవాలయం ఆ ప్రదేశానికి మరింత పవిత్రతను, ప్రాముఖ్యతను సంతరించి పెట్టింది. మహర్షి పరశురాముడు ప్రఖ్యాత మూకాంబిక దేవాలయాన్ని సృష్టించాడని పౌరాణిక గాధలు చెపుతాయి.

చరిత్ర నుండి కొన్ని వాస్తవాలు

మూకాంబికా దేవాలయం, దేశంలో పేరొందిన మత పర కేంద్రాలలో  ఒకటిగా విలసిల్లుతోంది. శక్తి దేవస్ధానంగా పూజించబడుతోంది. మాత పార్వతీ దేవి మూకాసురుడనే రాక్షసుడిని ఇక్కడ వధించిందని, అందుకుగాను ఈ ప్రదేశానికి మూకాంబిక అనే పేరు వచ్చిందని చెపుతారు. దేవాలయంలో  జ్యోతిర్లింగం ప్రధానంగా ఉంటుంది. ఈ జ్యోతిర్లింగానికి బంగారు గీత అంటే స్వర్ణ రేఖ మధ్యగా ఉంటుంది. లింగానని రెండు  భాగాలుగా చేస్తుంది. చిన్న భాగం బ్రహ్మ, విష్ణు, శివ త్రిమూర్తుల శక్తిగాను, పెద్ద భాగం  శక్తి దేవతలైన సరస్వతి, పార్వతి, లక్ష్మీ లను చిహ్నంగా చూపుతుంది.

అందమైన దేవి మూకాంబిక లోహ విగ్ర హం జ్యోతిర్లింగ వెనుక భాగంలో శ్రీ ఆది శంకరులవారు ప్రతిష్టించారు. ఆ దేవి ఆయనకు సాక్షాత్కరించిందని, ఆయనతో కలసి కేరళ రాష్ట్రానికి వెళ్లేటందుకు సిద్ధపడిందని అయితే ఆ దేవత తాను ఆయనను అనుసరించేముందు ఆయన వెనక్కు తిరిగి చూడరాదని షరతు పెట్టిందని, చెపుతారు.

దేవి మూకాంబిక శంకరాచార్యుల వారితో కలసి ప్రయాణించి ఆ స్ధలం వరకు చేరే సరికి శంకరాచార్యుల వారు ఆమె వస్తోందా లేదా అని వెనక్కు తిరిగి చూసే సరికి  ఆమె కాలి గజ్జెల శబ్దం ఆగిపోయిందని, షరతు మేరకు ఆమె   రావటానికి తిరస్కరించి అక్కడే ఉండిపోయిందని చెపుతారు. ఇక ఆపై శంకరాచార్యుల వారు కొల్లూరు దేవాలయంలో దేవి లోహ విగ్రహాన్ని జ్యోతిర్లింగం వెనుక భాగంలో  ప్రతిష్ట చేశారు.  

ఈ ప్రాంత సందర్శనలో మహిమాన్విత కొల్లూరు దేవాలయమే కాక, అడవిలోగల అరిశన గుండి జలపాతాలను కూడా చూడవచ్చు. జలపాత ధారలపై పడే సూర్య రశ్మి బంగారు వన్నె రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది.  కన్నడ భాషలో అరిశెన అంటే పసుపు పొడి   అని చెపుతారు.

కొడచాద్రి పర్వత శ్రేణులుదీని సమీపంలోనే శ్రీ ఆది శంకరాచార్యులవారు తపస్సు చేసి దేవి సాక్షాత్కారాన్ని పొందిన కొడచాద్రి కొండ శ్రేణులు కూడా కలవు. ట్రెక్కింగ్ అభిలాషులు తరచుగా దర్శిస్తారు. ఈ పట్టణాన్ని సాధారణంగా నవరాత్రి లేదా దసరాలలో భక్తులు అధిక సంఖ్యలో సందర్శిస్తారు.  కొల్లూరు ప్రాంతం, వైల్డ్ లైఫ్ రిజర్వులో ఒక భాగం. మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంక్చువరి సహజ రక్షిత అడవులలో ఒకటి. దీనికి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ కూడా సహాయం చేస్తుంది. ఈ ప్రాంతంలో అబ్బురపరచే ఎన్నో లోయలు, కొండలు, జలపాతాలు ఉంటాయి. అక్కడకల దేవాలయం. మీకు ఆ ప్రాంత అనుభవాలను మరచిపోలేనిదిగా చేస్తుంది.  

Please Wait while comments are loading...