దండేలి - పచ్చదనాల ప్రేమికులకు కన్నుల విందు  

కర్నాటక లోని ఉత్తర కన్నడ జిల్లాలో దండేలి ఒక కుగ్రామం. దీని చుట్టూ దట్టమైన అడవుల సమూహాలతో పడమటి కనుమల కొండలు. దండేలి దక్షిణ భారతదేశంలో సాహస క్రీడలకు ప్రసిద్ధి గాంచింది.    దండేలి గ్రామం విశిష్టమైన ప్రదేశంలో ఉండి కర్నాటకకు వెన్నెముకగా వ్యవహరిస్తోంది. ప్రశాంతమైన ఈ పట్టణం విద్యాపరంగాను, పారిశ్రామికంగాను ఎంతో ముందుకు సాగిపోతోంది. పేపర్ తయారీకి మరియు ఇతర పేపర్ మిల్లులకు అంటే వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్ వంటి వాటికి ఈ ప్రదేశం ఎంతో పేరుపడింది. దండేలిని ఒక పర్యాటక కేంద్రంగా కూడా పరిగణిస్తారు.    

దండేలి పేరు ఎలా ఏర్పడింది?  దండేలి దండకారణ్యంలో ఉంది. కనుక దాని పేరుపై ఈ పట్టణానికి దండేలి అని పేరు వచ్చింది. అంతేకాక స్ధానిక దేవుడు దండేలప్ప పేరుపై కూడా ఇది ఏర్పడిందని చెపుతారు. దీనిపై మరోగాధ చెప్పాలంటే, దండకనాయక అనే రాజు ఇక్కడి అడవుల అందాలకు మోహితుడై దీనిని దండకారణ్యమని, ఊరును దండేలి అని పేరు పెట్టాడని చెపుతారు. దీనిపై మరోగాధ చెప్పాలంటే, దండకనాయక అనే రాజు ఇక్కడి అడవుల అందాలకు మోహితుడై దీనిని దండకారణ్యమని, ఊరును దండేలి అని పేరు పెట్టాడని చెపుతారు.    టూరిస్ట్ లు దండేలి ఎందుకు సందర్శిస్తారు?

దండేలి అడవులలో దండేలి వన్య ప్రాణుల సంరక్షణాలయం ఉంది. ఇది కర్నాటకలో రెండవ పెద్ద వైల్డ్ లైఫ్ శాంక్చువరీ. దీనిని 2007 లో టైగర్ రిజర్వుగా ప్రకటించారు. చుట్టూ దట్టమైన అడవులు, కావేరి ప్రవాహాలు, కాళి నది ఉపనది అయిన నగజారి నది ఉంటాయి.

ఈ శాంక్చువరీ వివిధ వన్య ప్రాణులకు అంటే పులులు, చిరుతలు, నల్ల పులులు, ఏనుగులు, జింకలు, దుప్పులు, ఎలుగులు, అడవి పిల్లులు, దున్నపోతులు, గుంటనక్కలు మొదలైన జంతువులకు, మరియు షుమారు 300 జాతుల పక్షులకు అనేక పాములకు, కప్పలకు నిలయంగా ఉంది.

దండేలి లోని కాళీ నదిలో అనేక నీటి క్రీడలు ఆచరిస్తారు. సైకిలింగ్ మరియు మౌంటెన్ బైకింగ్ వంటివి కూడా ఉంటాయి. మొసళ్ళు చూడటం, పచ్చటి ప్రదేశాల నడక, ట్రెక్కింగ్, బోటింగ్, పక్షుల సందర్శన, చేపలు పట్టటం వంటివి పర్యాటకులను ఆకర్షిస్తాయి.  

ఈ ప్రదేశం ప్రఖ్యాత చారిత్రక మతపర సంఘటనలకు ప్రసిద్ధి. ఇక్కడ ఉల్లవి దేవాలయం, సైక్స్ పాయింట్, సూపర్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాం, కవనా గుహలు, మరియు సింధేరి రాక్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. దండేలి కాళీ నది ఒడ్డున సముద్ర మట్టానికి 1551 అడుగుల ఎత్తున ఉంది. దీని వెనుక పడమటి కనుమలుంటాయి. సుమారు 125 కి.మీ. దూరంలో గోవా కలదు. దండేలి రోడ్డు మార్గం ద్వారా ధార్వాడ్, హుబ్లీ, మరియు బెల్గాం పట్టణాలకు కలుపబడి ఉంది.

Please Wait while comments are loading...