శివగిరి - సాహస కృత్యాలకు మారుపేరు

శివగిరి ప్రాంతం ప్రకృతి అందాలను ఇష్టపడేవారికి చక్కటి ప్రదేశం. దట్టమైన శివగిరి అడవులు యెమ్మెదొడ్డి గ్రామం సమీపంలో ఉండి చిక్కమగలూరు జిల్లాలోని  హొగ్గరెకనగిరి కొండలను కప్పేస్తూ ఉంటాయి.   కాఫీ తోటలు మరియు పులుల పరుగులు శివగిరి అడవులకే కాదు, విస్తారమైన కాఫీ తోటలకు కూడా ప్రసిద్ధి చెందింది. కొండపై 100 సంవత్సరాల చరిత్ర కల పురాతన కాఫీ ఎస్టేట్లు ఉన్నాయి. శివగిరి ఒక విశిష్టమైన ప్రదేశంలో టైగర్ రిజర్వు మధ్యలో ఉంది. కాఫీ తోటలలో సైతం పులులు ఎంతో హుందాగా  వీర విహారం చేస్తూ ఉంటాయి.

శివగిరి సమీపంలోని దొడ్డబాలె సిద్దరగుడ్డ శిఖరం 5500 అడుగుల ఎత్తు కలిగి సుమారు 400 సంవత్సరాల పురాతన శివాలయం కలిగి ఉంటుంది. ఇక్కడ ఇతర చూడదగిన ప్రదేశాలలో మడగడకెరె సరస్సు మరియు ముధోడి వన్య జీవుల సంరక్షణాలయం ప్రధానం. ముధోడి శాంక్చువరీ శివగిరి నుండి సుమారు 65 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. కనుమరుగైపోతున్న పక్షి మరియు జంతు జాలాలను చూడాలంటే, ఈ శాంక్చువరీకి ఒక పర్యటన తప్పక వేయాల్సిందే.

శివగిరి అడవుల పర్యటన వర్షాకాలం నెలలలో చాలా కష్టంగా ఉంటుంది. ఇతర కాలాలలో మాత్రం అధిక ఆనందం కలుగుతుంది. రాక్ క్లైంబింగ్ మరియు ట్రెక్కింగ్ ఆనందాన్నిస్తాయి. శివగిరి బెంగుళూరుకు 235 కిలోమీటర్ల దూరంలోను, హుబ్లీనుండి 215 కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది. హుబ్లీ రైలు స్టేషన్ శివగిరికి సమీపంగానే ఉంటుంది.

Please Wait while comments are loading...