హుబ్లీ - దక్షిణాది చివరి జంటనగరాలు

దక్షిణ భారతదేశంలో హుబ్లీ ఒక ప్రధాన నగరం. ధార్వాడ్ తో కలిపి జంటనగరాలుగా వ్యవహరిస్తారు. ఉత్తర కర్నాటకలో వాణిజ్య, పారిశ్రామిక, ఆటోమోబైల్, విద్యా మొదలగు రంగాలలో బెంగుళూరు తర్వాత ఎంతో పురోగతి సాధించింది.

హుబ్లీ అనే పదం హుబ్బళి నుండి వచ్చింది. కన్నడ భాషలో హుబ్బళి అంటే పూల తీగ అని అర్ధం. ఇది ఒక చారిత్రక నగరం. చాళుక్యుల కాలం నాటిది. గతంలో దీనిని రాయర హుబ్లీ లేదా ఎలియ పురవడ హళ్ళి మరియు పురబల్లి  అనేవారు. విజయనగర రాయ కాలంలో రాయర హుబ్లీ వ్యాపార కేంద్రం అయింది.  

చరిత్ర ప్రాధాన్యం  హుబ్లీని తరచుగా మరాఠాలు, మొగలులు, బ్రిటీష్ వారు తమ దాడులకు గురిచేశారు. బ్రిటీష్ వారు హుబ్లీలో ఫ్యాక్టరీ పెడితే దానిని శివాజీ 1675 లో దోచేశాడు. హుబ్లీ సావనూర్ నవాబ్ పాలనలో కొద్ది కాలం కలదు. దీనిని మరాఠాలు 1755-56 లో స్వాధీనం చేసుకున్నారు. మధ్యలో కొంతకాలం హైదర్ ఆలీ పట్టు కలిగి ఉండగా మరో మారు మరాఠాలు 1790లో దీనిని స్వాధీనం చేసుకున్నారు.

పురాతన హుబ్లీ బ్రిటీష్ స్వాధీనంలోకి 1817 లో వచ్చింది. కొత్త హుబ్లీ 1820లో ఏర్పడింది. 1880లో బ్రీటీష్ వారు ఇక్కడ రైల్వే వర్క్ షాప్ పెట్టారు. దానితో పారిశ్రామికంగా పురోగతి సాధించింది. నేడు హుబ్లీ కాటన్ జిన్నింగ్ మరియు ఇతర నేత పరిశ్రమలకు పేరొందింది.  

వ్యవసాయ పంటలు కారణంగా కాటన్, బఠాణీ వ్యాపారాలకు కర్నాటకలో ప్రసిద్ధి.  హుబ్లీ నైరుతి రైల్వే జోన్ మరియు హుబ్లీ డివిజన్.   టూరిస్టులు హుబ్లీలో ఏం చూడాలి? ఇటీవలే హుబ్లీ ఒక పెద్ద టూరిస్టు కేంద్రంగా మారింది. హుబ్లీలో భవాని శంకర దేవాలయం, అసర్, సిధ్ధారూఢ్ మఠం, ఉంకాల్ సరస్సు, న్రుపతుంగ బెట్ట, గ్లాస్ హౌస్ వంటివి ప్రధాన ఆకర్షణలు.  హుబ్లీ నుండి ధార్వాడ్, నవిల్ తీర్ధ, సత్తోడా, సోగళ్ళ మరియు మధోడా జలపాతాలు, ఇస్కాన్ దేవాలయం, సైక్స్ పాయింట్ మరియు ఉలావియా లకు పర్యాటకులు వెళ్ళవచ్చు. బీజపూర్, బీదర్, బాదామి, ఐమోళే, పటడకాల్, హంపి లకు వినోద యాత్రలు చేయవచ్చు.  

ఈ పట్టణం మలెనాడు మరియు దక్కన్ పీఠ భూమి మధ్యలో కలదు. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు హుబ్లీ సందర్శనకు అనుకూలం.  

కర్నాటకలోని ప్రధాన నగరాలనుండి రైలు, రోడ్డు మార్గాలలో హుబ్లీ తేలికగా చేరవచ్చు. హుబ్లీలో స్ధానిక విమానాశ్రయం కలదు. ఇక్కడినుండి బెంగుళూరు, హైదరాబాద్ మరియు ముంబై నగరాలకు విమానాలు నడుస్తాయి.  

Please Wait while comments are loading...