Search
 • Follow NativePlanet
Share

అంబోలి - ఒక సమీక్ష

13

అంబోలి మహారాష్ట్రలోని సముద్ర మట్టానికి సుమారు 700 మీటర్ల ఎత్తునగల ఒక చిన్న హిల్ స్టేషన్. పర్యాటకులను అమితంగా ఆకర్షించే ఈ ప్రదేశం సహ్యాద్రి శ్రేణులలో సింధుదుర్గ జిల్లాలో కలదు.  అంబోలి - చారిత్రక ప్రాధాన్యం అంబోలి పట్టణం ఒకప్పుడు బ్రిటీష్ పాలనలో కేంద్ర మరియు దక్షిణ భారత దేశాలకు రక్షణ దళ అవసరాలను సరఫరా చేసే ప్రాంతంగా ఉండేది. ఈ సమయంలోనే అంబోలి పట్టణాన్ని సుమారు 1880 లలో ఒక హిల్ స్టేషన్ గా ప్రకటించారు.  సావంతవాది స్ధానికులు ఈ చిన్న ప్రదేశ ప్రాధాన్యాన్ని బ్రిటీష్ పాలకులకంటే ముందే గ్రహించారు. అయితే, మహారాష్ట్రలోని వర్షాలు ఎల్లపుడూ ఈ ప్రదేశాన్ని తడిగా ఉంచటం చేత బ్రిటీష్ వారు ఈ ప్రదేశాన్ని వదిలి తమ వేసవి విడిదిగా మాధేరన్ ను ఎంపిక చేసుకున్నారు. ఫలితంగా అంబోలి పట్టణం మహా రాష్ట్ర మ్యాప్ లో ప్రాధాన్యతగలదిగా అధిక కాలం నిలువలేకపోయింది.

ప్రశాంతత కల హిల్ స్టేషన్వారాంతపు సెలవులు వచ్చాయంటే, ప్రశాంతమైన వాతావరణం గడపాలనుకునేవారికి అంబోలి హిల్ స్టేషన్ అద్భుతంగా ఉంటుంది. ఎంతో వేగవంతంగా నడిచే మన నగర జీవితాలనుండి కొద్దిపాటి విరామం కావాలంటే, ఈ ప్రదేశం ఎంపిక చేయదగినది.

అంబోలి లో ఎన్నో జలపాతాలు. షిర్గాంవ్ కర్ జలపాతాలు, మహాదేవ్ జలపాతాలు, మరియు నగట్టా జలపాతాలు వంటివి అనేకం కలవు. నగట్టా జలపాతాలు విశ్రాంతి, వినోద విహారాలకు అద్భుతంగా ఉంటాయి.  హిరణ్యకేశి జలపాతాలు సమీపంలో గుహల ముందు భాగంలో ఒక చిన్న శివాలయం కూడా ఉంది. ఈ శివాలయాన్ని సాక్షాత్తూ శివుడే ప్రతిష్టించాడని చెపుతారు. అయితే, ఈ దేవాలయానికి హిరణ్య కేశి దేవాలయం అని మాత పార్వతి దేవి పేరు రావటం జరిగింది.

హిల్ స్టేషన్ కావటం వలన, అంబోలి అనేక ప్రదేశాలను చూపుతుంది. సముద్రం, కేవల్సడ్ పాయింట్, పరీక్షిత్ పాయింట్ మరియు మహదేవగఢ్ పాయింట్ వంటివి ఇక్కడినుండి చూడవచ్చు. ఈ ప్రాంతాలన్ని అరేబియా సముద్రం మరియు కొంకణ్ తీరం కలిసే చోట ఏర్పడినవి.  అంబోలికి ఎపుడు వెళ్ళాలి ? ఎలా వెళ్ళాలి? అంబోలి హిల్ స్టేషన్ కావటం వలన, సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున ఉండటం చేత మండు వేసవిలో కూడా పర్యటించవచ్చు. అయితే, మే నెల మాత్రం ఎంతో వేడి కనుక సూచించదగినది కాదు. వర్షాకాలం ఈ ప్రాంతంలో ఆనందించవచ్చు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు గా ఉండి ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రదేశ సందర్శనకు చలికాలం కూడా అనుకూలమే.

అంబోలి విమానం, రైలు, రోడ్డు మార్గాలలో చేరవచ్చు. ఇది సావంత్ వాడి మరియు గోవాలకు సమీపంలో ఉంటుంది. విమానం ద్వారా చేరాలనుకునేవారు గోవాలోకల స్ధానిక విమానాశ్రయం 70 కి.మీ.ల దూరంకలది ఉపయోగించవచ్చు. రైలు ప్రయాణానికి సావంత్ వాడి రైలు స్టేషన్ అనుకూలం. అక్కడనుండి అంబోలికి క్యాబ్ లలో చేరవచ్చు. అంబోలి నుండి ముంబైకి 490 కి.మీ.లు, పూనేకు సుమారుగా 343 కి.మీ.ల దూరం ఉంటుంది. ఈ పట్టణాలనుండి అనేక బస్సులు నడుస్తాయి.

అంబోలి ఒక పర్యావరణ పర్యాటక ప్రదేశం. ఎన్నో రకాల మొక్కలు, జంతువులు కనపడతాయి. కొద్దిపాటి ప్రశాంతత వినోదం కావాలనుకునేవారికి అంబోలి హిల్ స్టేషన్ విశ్రాంతి ఎంతో నచ్చుతుంది. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు చల్లటి గాలి, ఈ ప్రదేశాన్ని స్వర్గంలా చేశాయి. దీనిని కొంకణ్ తీర మహా బలేశ్వర్ అని కూడా పిలుస్తారు.  

అంబోలి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అంబోలి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అంబోలి

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? అంబోలి

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు ప్రయాణం అంబోలి పట్టణం పాణజిం, కొల్హాపూర్, బెల్గాం వంటి ప్రధాన నగరాలతో రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించబడింది. ముంబై షుమారు 490 కి.మీ. దూరం కాగా పూనే మరింత దగ్గరగా 343 కి.మీ.ల దూరంలో కలదు. ఈ నగరాలనుండి అంబోలి పట్టణానికి ప్రభుత్వ మరియు ప్రయివేటు వాహనాలు ఎన్నో నడుస్తూంటాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు ప్రయాణం అంబోలికి 52 కి.మీ. దూరంలో సావంత్ వాడి రైలు స్టేషన్ కలదు. ఇక్కడి నుండి అంబోలి చేరాలంటే టాక్సీ ధర రూ. 350 గా ఉంటుంది. తేలికగా చేరవచ్చు.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  అంబోలి ఎలా చేరాలి? విమాన ప్రయాణం అంబోలికి 67 కి.మీ. ల దూరంలో గల గోవాలో స్ధానిక విమానాశ్రయం కలదు. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు మరియు మహా రాష్ట్రలోని ప్రధాన పట్టణాలకు ప్రతిరోజూ రాకపోకలు కలిగి ఉంది. ముంబై లోని ఛత్రపతి శివాజి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా దీనికి సుమారు 492 కి.మీ.ల దూరంలో కలదు.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Jan,Sat
Return On
23 Jan,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
22 Jan,Sat
Check Out
23 Jan,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
22 Jan,Sat
Return On
23 Jan,Sun