సావంత్ వాడి - ఇంద్రియాలకు ఆనందం

దట్టమైన అడవులతో, సుందరమైన సరస్సులతో , ఎత్తైన పర్వత శ్రేణులతో, కొంకణ్ తీరంలో అక్కడి స్ధానికుల సంస్కృతితో పర్యాటకులను ఆనందపరచే పట్టణం సావంత్ వాడి

 సావంత్ వాడి మహారాష్ట్రకు నైరుతి దిశలోగల సింధు దుర్గ జిల్లాలో కలదు. ఈ ప్రదేశ మాజీ పాలకుడు ఖేమ్ సావంత్ పేరు మీదుగా ఈ పట్టణానికి సావంత్ వాడి అనే పేరు వచ్చింది.

 సావంత్ వాడి ప్రదేశం సహ్యాద్రి కొండలు లేదా పడమటి కనుమలలో తూర్పు ప్రాంతంనుండి పడమట గల అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రదేశం ఒక కావ్య ప్రదేశం. ఎన్నో మధురానుభూతులను మీకు అందిస్తుంది. కొంకణ్ రుచులను అది ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గోవా బీచ్ కు దగ్గరలో కలదు.

స్ధానిక ప్రజలు

గతంలో సావంత్ వాడి మరాఠా రాజ్యానికి బలమైన కోటగా ఉండేది. తర్వాతిరోజులలో ప్రత్యేకత సంతరించుకొని ఇపుడు సాంప్రదాయక మాల్వాని గా పిలువబడుతోంది.. ఇక్కడి ప్రజలు వారి సంస్కృతి, కళా నైపుణ్యాలు కు అంటిపెట్టుకొని నెమ్మది మరియు ప్రశాంతమైన జీవనాలు గడుపుతారు.

 ఇక్కడి ప్రజలలో ప్రధానంగా మరాఠాలు, ఇతరంగా కొంకణ్ హస్త బ్రాహ్మణులు, దళితులు, మాల్వాని ముస్లింలు తగు మాత్రం జనసంఖ్యలో ఉంటారు.

 ఆహారం

సావంత్ వాడిలో భలేరావ్ ఖానావళి ఒక రుచికర పదార్ధాల రెస్టరెంటు. ఇక్కడకు వచ్చిన వారు ఈ రెస్టరెంట్ ఆహారాలు రుచి చూడవలసినదే. ఇక్కడ సాంప్రదాయక కొంకణి ఆహారం ప్రతి వంటకంలో కొబ్బరి కలిపి చేయబడుతుంది.

సంస్కృతి

పర్యాటకులు ఇక్కడ వారు మెచ్చే హాస్త కళల వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఈ వస్తువులన్ని స్మాల్ స్కేల్ లేదా ఇంటి వద్ద పెట్టే పరిశ్రమలలోనివే. రక రకాల బొమ్మలు, పెయింటింగ్ లు వెదురు బద్దల తయారీలు దొరుకుతాయి. ఇక్కడ సా్ధానికంగా కొంకణి, మరాఠి, ఉర్దు, ఇంగ్లీష్ భాషలు వాడతారు. వన్య జంతువులపై ఆసక్తి కలవారుఅటవి ఎద్దులు, చిరుతలు, ఎలుగుబంటులు, పులులు మున్నగునవి చూడవచ్చు. ప్రకృతి ప్రియులు ఔషధ మూలికలు, చెట్లు, వివిధ రకాల మొక్కలు చూసి ఆనందించవచ్చు.

భారతీయ గ్రామీణ ప్రాంత అందాలను ఆధునికతతో కలిపి సావంత్ వాడి మీకు అందిస్తుంది. పర్యాటకులు మోతి తలావ్, రాయల్ ప్యాలెస్, ఆత్మేశ్వర్ తాళి, నరేంద్ర గార్డెన్, హనుమాన్ మందిర్, అంబోలి హిల్ స్టేషన్, కోలాగాంవ్ దర్వాజా, విఠల్ మందిర్ వంటి ప్రదేశాలు చూడవచ్చు.

సావంత్ వాడి గోవా తీరం. గోవాలో వేసవి ఎలా ఉంటుందో అలాగుంటుంది. గోవా చుట్టు పక్కల తిరిగే పర్యాటకులు సావంత్ వాడి వాతావరణం ఆనందిస్తారు. వేసవిలో ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలనుండి 35 డిగ్రీలవరకు పగటిపూట మారుతూంటాయి. రాత్రులు చల్లగా ఉంటుంది. వర్షాలు ఒక మోస్తరుగా ఉంటాయి. అయితే, గత కొద్ది సంవత్సరాలుగా అధికంగా ఉన్నాయి. ఓవర్ కోట్లు, బూట్లు వంటివి తప్పని సరి. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 18 నుండి 26 డిగ్రీల వరకు మారుతూంటాయి. సావంత్ వాడి రోడ్డు, రైలు మార్గాలలో ముంబై లేదా గోవాలనుండి ప్రయాణించవచ్చు. రాష్ట్ర సరిహద్దులో ఉండటం చేత అది గోవాకు దగ్గరగా ఉంది. ముంబై నుండి సుమారు 8 గంటలలో చేరవచ్చు. రోడ్డు ప్రయాణం సూచించదగినది.. ముంబై నుండి పూనే చేరి సతారా హైవే మీదుగా, ఉత్తూరు నుండి సావంత్ వాడి చేరటం సూచించదగినది.

Please Wait while comments are loading...