Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అంబోలి » వాతావరణం

అంబోలి వాతావరణం

పర్యటనకు అనుకూల సమయంఅంబోలి సంవత్సరం పొడవునా ఒక మోస్తరు వాతావరణం కలిగి ఉన్నప్పటికి, శీతాకాలం పర్యటనకు అనుకూలమైనదిగా భావించాలి.

వేసవి

అంబోలి వాతావరణంవేసవి వేసవి ఈ ప్రదేశంలో మార్చి నుండి మే వరకు ఉంటుంది. పగలు, రాత్రులు అధిక వేడి కలిగి ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలనుండి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మారుతూంటాయి. మే నెల పర్యటనకు అనువైనది కాదు.

వర్షాకాలం

వర్షాకాలంజూన్ నెలనుండి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ సెంటీగ్రేడ్ గా ఉంటాయి. మీరు వర్షాకాలం ఇష్టపడేవారైతే, ప్రాంత సందర్శనకు సంసిద్ధులై జలపాతాల అందాలను తనివి తీరా ఆస్వాదించవచ్చు.   

చలికాలం

శీతాకాలం అంబోలి లో శీతాకాలం డిసెంబర్ లో మొదలవుతుంది. ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో వతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉండి పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్టం 10 డిగ్రీలనుండి గరిష్టంగా 30 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మారుతూంటాయి.