వెగేటర్  - తెల్లని ఇసుక పై చిన్న షికారు!

ఈ బీచ్ పెద్దగా పేరు పడనప్పటికి ఆకర్సణీయమైనదే. మాపూసా నుండి ఒక ఇరుకైన సందు ద్వారా అక్కడకల బంగళాలు, మధ్య నుండి దీనిని చేరవచ్చు. పక్కనే కల అంజునా బీచ్ ఆకర్షణ దీని ప్రాధాన్యతను తగ్గిస్తోంది. బెగేటర్ బీచ్ ఛపోరా కోట దగ్గరలో కలదు. తెల్లని పరిశుభ్రమైన ఇసుక. బీచ్ లో అనేక రెస్టారెట్లు, హోటళ్ళు కలవు.  వాటిలో పేరు గాంచినది ప్రిమ్ రోజ్ షాక్. దీనిలో గోవా వంటకాలు, మరి కొన్ని సాంప్రదాయ భారతీయ వంటకాలు దొరుకుతాయి. సముద్రపు ఆహారాలు కావలసినన్ని అందుబాటులో ఉంటాయి. చీకటి పడిందంటే, ఇక్కడే కల నైన్ బార్ చేరి ఆనందించేయండి.   

వెగేటర్ చేరటం చాలా తేలిక. ఒక క్యాబ్ డ్రైవర్ ను మాపూసా లేదా అంజునా బీచ్ తీసుకు వెళ్ళమని అడగండి. అక్కడనుండి నడుచుకొంటూ వెగేటర్ చేరవచ్చు. లేదా కండోలిం లేదా బాగా లనుండి అద్దె స్కూటర్ పై కొద్ది నిమిషాలలో వెగేటర్ చేరుకోవచ్చు.  

Please Wait while comments are loading...