గోవాలోని ఇతర కోటలవలెనే, గత దశాబ్ద కాలం నుండి ఛపోరా కోటకు కూడా ఏ రకమైన ఖచ్చితమైన పునర్నిర్మాణ కార్యక్రమాలు లేవు. అయినప్పటికి ఈ కోట ఆకర్షణీయంగానే కనపడుతుంది. నేటికి పర్యాటకులు ఆల్గే మరియు బూజు పట్టిన ఈ కోటకు ఆకర్షితులవుతారు. ఒకప్పుడు ఈ కోట పోర్చుగీసు శిల్పకళా వైభవానికి అద్దం పడుతూండేది. కట్టడ నిర్మాణం ఎంతో బలంగా ఉంటుంది. ఛపోరా ప్రత్యేకత ఏమిటి? ఛపోరా కోటను పోర్చుగీసు పాలకులు సుమారుగా 1617 సంవత్సరంలో నిర్మించారు. దీనిని వారు తమపై సాగుతున్న హైందవ దాడులనుండి రక్షించుకునేందుకు నిర్మించారు. ఈ కోట నిర్మాణం కూడా సుమారుగా అగోడా కోట నిర్మాణ సమయంలోనే జరిగింది. అయితే, అగోడా కోట హిందువుల దాడులకు నిలువలేకపోయింది. నేడు అగోడా కోట శిధిలాలలో ఉన్నప్పటికి ఎంతో చరిత్ర మీకు చెపుతుంది. గతంలో షాపూరా అనే పేరుతో ముస్లిం మతస్తుల ప్రదేశంగా చెప్పబడే ప్రాంతంలో ఛపోరా కోట నిర్మాణం జరిగింది. షాపూరా అనే పేరు కాలక్రమేణా ఛపోరాగా మారిపోయింది. ఈ కోటను సుమారుగా 1892 సంవత్సరంలో చిట్ట చివరకు పోర్చుగీసు వారు వదలిపెట్టేశారు. అయినప్పటికి నేటికి ఇక్కడ వారిపై జరిగిన దాడి మరియు యుద్ధం రెంటికి సంబంధించిన సరఫరా సొరంగాలు కనపడతాయి. ఛపోరా కోట శిధిలాలకు ఎలా చేరాలి? ఛపోరా కోట ఉత్తర బర్డేజ్ జిల్లాలోని వేగేటర్ బీచ్ సమీపంలో ఉంటుంది. దీనిని అక్కడికి పది కిలో మీటర్ల దూరంలోనేగల మాపూసా పట్టణం నుండి తేలికగా చేరవచ్చు. మీరు కనుక బాగా, కాలనగూటే, అంజునా ప్రాంతం లలో కనుక వున్నట్లయితే, ఈ ప్రదేశం చేరటానికి అధిక సమయం పట్టదు. ఉత్తర దిశగా సాగిపోండి. పనాజిం లేదా వాస్కోలనుండి క్యాబ్ లో చేరవచ్చు. గోవాలోని కోటలు చూడాలంటే మీరు తప్పక ఒక కారు కాని లేదా ఒక బైక్ కాని అద్దెకు పొందాల్సి ఉంటుంది. ఈ రకమైన సదుపాయంతో మీరు అతి తక్కువ సమయంలో అధిక ప్రదేశాలు చూడగలుగుతారు. ఛపోరా కోటను సందర్శించాలంటే, వేసవి కాలం అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు.