ఈ బీచ్ లో ప్రయివసీ అధికంగా ఉంటుంది. కనుక కొత్తగా పెళ్ళి అయిన జంటలు, హానీమూన్ కు వచ్చినవారు బాగా ఆనందిస్తారు. ఇది మాపూసా బీచ్ చివరగా ఉంటుంది. ఒక పక్కగా, వేరుగా కొద్దిపాటి గుడిసెలు, హోటళ్ళతో మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రశాంతంగా ఆనందించాలంటే, చదివేందుకు ఒక పుస్తకం లేదా మరింత ఆనందానికి పక్కలో భార్య ఉండి తీరాలి.
బీచ్ లో కాజురినా చెట్లు అధికంగా కనపడతాయి. ఇక్కడే తెల్లటి పొట్ట గల చేప గద్దను కూడా చూడవచ్చు. ఇక్కడి హోటళ్ళలో ఎండ్ ఆఫ్ ది వరల్డ్ సూచించదగినది. ఇది ఒక చిన్న హోటల్ అయినప్పటికి సీఫుడ్డ్ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇతర ఆకర్షణలు అంటే, నేటికి చక్కగా రక్షించబడుతున్న పోర్చుగీస్ కోట. మాండేరం బీచ్ చేరాలంటే అద్దెకు తీసుకున్న ఒక ద్విచక్ర వాహనం లేదా మీ స్వంత కారు సూచించదగినది. లేదా బేరసారాలాడి ఒక క్యాబ్ లో రావచ్చు. రాత్రి వేళ బీచ్ చేరుకుంటే, ఇసుకలో వాలి ఆకాశంలోని నక్షత్రాలను లెక్కిస్తూ కూడా ఆనందించవచ్చు.