బాగా  - వినోద సమయ విహారం!

బాగా తప్పక చూడవలసిన ప్రదేశం. ఈ ప్రాంతంలో మంచి బీచ్ షాక్స్ నుండి మంచి రెస్టరెంట్లు, అతిమంచి హోటళ్ళు, వసతులు, ఒరిజినల్ జర్మన్ బేకరీ అన్నీ ఉంటాయి. బాగా బీచ్ ఎంతో గ్రాండ్ గా ఉండటమే కాక మీకు అమితమైన ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఈ బీచ్ లో సాహస క్రీడల టికెట్లు అమ్మకం చేస్తూ బ్రోకర్లు తిరుగుతూంటారు. వారు కొంత కమీషన్ తీసుకుంటూ మిమ్ములను అసలైన ఏజంట్లకు అప్పగిస్తారు. చాలావరకు మీకు నష్టం లేకుండానే వ్యవహారం జరుగుతుంది. ఈ బీచ్ లో పారాసెయిలింగ్, వాటర్ బైక్ రైడ్, బనానా రైడ్, బోటింగ్ వంటివి ఉంటాయి. బీచ్ ప్రవేశంలోనే బ్రిట్టోస్ కేఫ్ ఉంటుంది. దీనిలో కావలసినంత ఆల్కహాల్ మరియు కాక్ టెయిల్స్ మరియు వాటితోపాటు సీఫుడ్స్ దొరుకుతాయి. దీనిలో గోవా ఫిష్ కర్రీ రైస్ తప్పక తినాలి.

ఈ హోటల్ లో ధరలు సమంజసమే. సాయంత్రం అయిందంటే చాలు, సముద్రపు అలలు సుమారుగా బ్రిట్టోస్ ముందు భాగం వరకు వచ్చేస్తాయి. వాటిని చూస్తూ రుచికరమైన డిన్నర్ ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు. బ్రిట్టోస్ హోటల్ ముందు భాగంలో ఒక చిన్న బేకరీ ఉంటుంది. సరిగ్గా గమనించాలి. చక్కటి ఐరోపా అలంకరణ దీని ముందుభాగంలో ఉంటుంది. పర్యాటకులు దీనిలో నోరూరించే చాక్లెట్ బిస్కట్లు తప్పక తినాలి.   బాగా బీచ్ లో రాత్రి కచేరీలు సర్వ సాధారణం. ఇక్కడి గుడిసెలు చాలావరకు సాయంత్రం అయిందంటే చాలు కచేరీ ఏర్పాట్లు చేస్తాయి. వివిధ రకాల రుచులతో హుక్కాలు కూడా ఏర్పాటు చేస్తారు. గోవాలోని వివిధ ప్రదేశాలనుండి బాగా బీచ్ కు వచ్చేస్తారు. బీచ్ లో వాహనాలలో వచ్చే వారికి పార్కింగ్ సదుపాయం కూడా కలదు.

దుస్తులు, చెప్పులు, ఇతర ఫ్యాన్సీ వస్తువులు షాపింగ్ చేసుకోవచ్చు. బేర సారాలు సరే సరి. బాగా బీచ్ కు సమీపంలోనే రాత్రి కచేరీలుకు ప్రసిద్ధి చెందిన క్లబ్ మాంబోస్ కూడా ఉంది. బాగా ప్రాంతం చూడాలంటే, కాలినడక సూచించదగినది. కాండోలిం, పాణజిం లేదా మరి ఏ ఇతర సమీప బీచ్ లనుండైనా చేరవచ్చు. ఇక్కడకు చేరాలంటే, క్యాబ్ లేదా ఆటో రిక్షా సూచించదగినది. మీరు ఒక సారి పాణజిం చేరుకున్నారంటే అక్కడినుండి మీకు బాగా బీచ్ ప్రదేశ మార్గాన్ని చూపే అనేక బోర్డులు కనపడతాయి.   

Please Wait while comments are loading...