సాంగ్లి - పసుపు కొమ్ముల నగరం

మహారాష్ట్రలోని సాంగ్లీ పట్టణం పసుపు కొమ్ముల నగరం గా ప్రసిద్ధి చెందింది. సంగ్లీ అంటే ‘సహా గలి’ అని అర్ధం. అంటే మరాఠీ భాషలో ‘ఆరు వీధులు’ అని చెపుతారు. ప్రాచీన కాలంలో, సంగ్లి పట్టణాన్ని నాట్య పంధారి ...అంటే మరాఠి డ్రామాలకు పుట్టినిల్లు అని కూడా అనేవారు.  సాంగ్లీ - రాజకుమారుల రాష్ట్రం 12వ శతాబ్దంలో చాళుక్య సామ్రాజ్యంలో సంగ్లీ కి సమీపంగా గల ఒక చిన్న పట్టణం రాజధానిగా ఉండేది. బ్రిటీష్ పాలనలో అది 11 తుపాకుల రాచరిక రాష్ట్రాలకు బదిలీ అయింది. మరాఠా పాలనలో అది మరాఠా జాగీర్ గా వ్యవహరించేవారు. స్వాతంత్రానికి ముందు కాలంలో సంగ్లీ పట్వర్ధన్ రాజ కుటుంబీకులచే పాలించబడింది.  

సాంగ్లీ పట్టణంలో తప్పక చూడవలసిన ప్రదేశాలు  సంగ్లీ అనేక దేవాలయాలు, బ్రిడ్జిలు మరియు జంతు సంరక్షణాలయాలు కలిగి ఉంటుంది. ఇక్కడకల సాగరేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురి పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది. దీనిలో సుమారు 52 రకాల జంతువులు కనపడతాయి. శాంక్చురీలోనే అనేక దేవాలయాలు మరియు ఇతర పుణ్య క్షేత్రాలు కలవు. సంగమేశ్వర దేవాలయం మరియు గణపతి దేవాలయం ఈ ప్రాంతంలోని దేవాలయాలలో ప్రధానం అయినవి. మొదటి దానిలో శివ భగవానుడు, రెండవది గణపతి దేవాలయం. ఇది సుమారు రెండు ఎకరాలకు మించిన ప్రదేశంలో నల్లటి రాతితో నిర్మించబడింది. రెండు దేవాలయాలు వేడుక సందర్భాలలో వేలాది భక్తులను ఆకర్షిస్తాయి.  హిందువుల కేలండర్ మేరకు శ్రావణమాసంలో సంగమేశ్వర దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ ప్రాంతంలోనే రామలింగ, దత్తదేవ మరి కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి.

ఈ దేవాలయాలన్నిటి మధ్య వీటితో సమాన ప్రాముఖ్యత కల ఒక మిరాజ్ దర్గా కూడా ఉంది. దీనికి అన్ని మతాల వారు విశ్వాసంతో వస్తారు. పూజలు చేస్తారు. సంగ్లీ కోట ప్రతిష్టాత్మకమైన నిర్మాణం. దీనిని మరాఠా పాలనలో నిర్మాణం చేశారు. ఇపుడు అది కలెక్టర్ కార్యాలయంగా చేయబడింది.

దండోబా హిల్ ఫారెస్ట్ ప్రెజర్వ్ లో ట్రెక్కర్లకు కావలసిన ఉత్సాహకరమైన ట్రెక్కింగ్ మరియు హైకింగ్ అవకాశాలున్నాయి.    సాంగ్లీ ఎందుకు వెళ్ళాలి?  సంగ్లీ లో పసుపు తయారీ అధికం. ఆసియాలోనే పెద్ద తయారీ. ఇక్కడి మహావీర్ నగర్ లోని సుగంధ ద్రవ్యాల కేంద్రంనుండి మీకు అవసరమైన పసుపు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు.  సాంగ్లీ ఒక షాపింగ్ కేంద్రం కూడాను. ఏ వస్తువులు కోరేవారికి ఆ వస్తువులు తప్పక లభిస్తాయి. నగలు కొనాలంటే, సరాభ్ బజార్, దుస్తులు కొనాలంటే, కపడా పేట, ఫుట్ వేర్ మరియు రెడీమేడ్ దుస్తులకు మారుతి రోడ్డు, మేకప్ సామాగ్రి, కాస్మెటిక్స్, వసంత మార్కెట్ యార్డు లో డ్రై ఫ్రూట్స్ మరియు మీరజ్ మార్కెట్ లోసంగీత వాయిద్య పరికరాలు లభిస్తాయి. సాంగ్లీ లో అపారమైన మరాఠి సంగీతం మరియు డ్రామా గతంలో దొరికేవి, ఇప్పటికి అవి ఈ పట్టణంలో కొనసాగుతూనే ఉన్నాయి. సంగ్లీ అనేక సామాజిక మరియు రాజకీయ రంగాలకు ప్రసిద్ధి అనేది అందరికి తెలిసిన ఒక వాస్తవం. ఆర్ ఆర్ పాటిల్, ఆషా భోస్ లేమరియు వసంత దాదా పాటిల్ వంటి ప్రముఖులు ఈ పట్టణానికి చెందినవారే.

సాంగ్లీ గురించి మరికొన్ని వాస్తవాలు సంగ్లీ వాతావరణం సంవత్సరంలో చాలా భాగం ఎంతో వేడిగా ఉంటుంది. వేసవి కాలంలో, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా ఉండి అసౌకర్యంగా ఉంటాయి. కనుక ఈ సమయంలో సంగ్లీ సందర్శన అనుకూలం కాదు.

వేసవి వెళ్ళిందంటే చాలు, వర్షాలు అధికంగా పడి పర్యాటకులను స్వాగతిస్తాయి. పరిసరాలు చల్లగా, ఆహ్లాదంగా ఉండి పర్యటనకు అనుకూలంగా ఉంటాయి.

సాంగ్లీ చేరుకోవాలంటే, రోడ్డు, రైలు, వాయు మార్గాలు మూడూ ఎంతో అనుకూలంగా ఉంటాయి. విమాన ప్రయాణం ఎంచుకునేవారు, కొల్హాపూర్ విమానాశ్రయం చేరుకొని అక్కడినుండి సంగ్లీ చేరవచ్చు. రైలు ప్రయాణానికి సంగ్లీ అనేక రైళ్ళతో నేరుగా ప్రధాన నగరాలకు మరియు మహారాష్ట్రకు బయట గల ప్రదేశాలకు అనుసంధానించబడింది.  

రోడ్డుపై ప్రయాణించాలనుకునేవారు బాంబే - బెంగుళూరు జాతీయ రహదారి మరియు రత్నగిరి - నాగపూర్ రహదారులలో సంగ్లీ జిల్లాకు చేరవచ్చు.

సాంగ్లీ పట్టణం వేగంగా అభివృద్ధి చెందే పట్టణాలలో ఒకటి. మన చారిత్రక నేపధ్యానికి అద్దం పడుతుంది. షాపింగ్ కేంద్రం. మీరు మీ విశ్రాంతి సెలవులను ఆనందంగా గడపవచ్చు.   

Please Wait while comments are loading...