Search
 • Follow NativePlanet
Share

ఖండాలా - పర్యాటకుల స్వర్గం

18

వారం అంతా అవిశ్రాంతంగా పనిచేసి ఆటవిడుపు కోరుకొనేవారికి మహారాష్ట్ర లోని ముఖ్య పర్వత కేంద్రాలలో ఒకటైన ఖండాలా ప్రధాన ముఖద్వారం.  భారతదేశం లో పశ్చిమ భాగంలోని సహ్యాద్రి పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి 625 మీటర్ల ఎత్తులో గల ఈ ప్రాంతం ఒక ముఖ్య పర్యాటక ప్రదేశం. పర్వతారోహకుల స్వప్నమైన కర్జాట్ నించి 7 కిలోమీటర్ల దూరంలో, మరొక అందమైన పర్వత కేంద్రమైన లోనావాలా నుండి 3 కిలోమీటర్ల దూరంలో బోర్ఘాట్ అంచున ఉంది.

ఈ ప్రదేశం పుట్టుక గురించి నమ్మదగిన ఏ రకమైన చారిత్రక రుజువులు లేవు. అయినప్పటికీ, బ్రిటీష్ వారి అధీనంలోకి రాకముందు,  దీన్ని గొప్ప మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ, తర్వాత పీష్వాలు పరిపాలించారన్నది బాగా తెలిసిన విషయం. అన్ని ఇతర పర్వత కేంద్రాలవలె, ఖండాలా కూడ బ్రిటిష్ రాజరికానికి గట్టి సాక్ష్యంగా నిలిచింది. ఈ ప్రదేశంలో గల చారిత్రక స్థలాలు, కట్టడాలు భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతిబింబాలు.

మిరుమిట్లు కొలిపే ఆకర్షణలు, ఉత్కంఠభరితమైన దృశ్యాలు

సహ్యాద్రి పర్వత శ్రేణులలోని కొండలు, లోయల మధ్య గల ఈ వేసవి విడిది ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిఉంటుంది. పర్యాటకులకు కళ్ళు చెదిరే ఆరాధ్యనీయమైన అద్భుత ప్రకృతి సౌందర్యం, పచ్చని కొండలపై ఉత్కంఠభరితమైన దృశ్యాలు, మనోహరమైన లతలు, అందమైన సరస్సులు, దివ్యమైన సెలయేళ్ల తో ఖండాలా పర్యాటకులకు దిగ్భ్రమపరుస్తుంది. అమృతాంజన్ పాయింట్, డ్యూక్స్ నోస్, రైవుడ్ పార్క్ , బుషీ డాం యాత్రికులకు ఆసక్తి కలిగించే మరికొన్ని ప్రాంతాలు.

తన అపారమైన సహజ వైభవంతో బాటు ఈ పర్వత కేంద్రం కల్గి ఉన్న గుహాలయాలలో కొన్ని క్రీ.పూ. 2 శతాబ్దానికి చెందినవి. బౌద్ధ వాస్తు నిర్మాణానికి ప్రాతినిధ్యం వహించే ఈ ఆలయాలు గతంలో హీనయన శాఖ ఉనికికి సాక్ష్యాలు.

మనోహరమైన ఈ లోయలలో నడవడం వల్ల  ప్రకృతి ప్రేమికులకు, ఔత్సాహికులకు ఈ ప్రాంత ఆద్యాత్మిక ఆకర్షణ తెలుస్తుంది. అపారమైన ప్రకృతి అందంతో ఆశీర్వదించిబడిన ఖండాలాను  ఆస్వాదించడానికి ప్రకృతి అందాలు ఎంతో విరబూసే వర్షాకాలం అనువైనది. పరిసరాలు బాగా తాజాగా పచ్చగా మధురంగా ఉండి  సాహస భావనను కల్గిస్తాయి.  ఖండాలా గొప్పతనాన్ని  అనుభవించడానికి అక్టోబర్ నుండి మే వరకు అనువైన కాలం.

ఈ అందమైన పర్వతాలు పర్వతారోహణ కు అనువైనవి. మీరు ప్రావీణ్యం గల వారైనా, ఔత్సాహికులైనా ఏదో ఒక కొండ నుండి పైకి ఎక్కి అక్కడినుండి లోయల అధివాస్తవికత ను చూడవచ్చు. రాళ్ల పై ఎక్కడానికి డ్యూక్ నోస్ పీక్, కర్ల కొండలు ప్రసిద్ద మైనవి.

దేశం లోని ఆసక్తి గల్గించే అనేక ప్రాంతాలలో ప్రకృతిశోభను కల్గి ఉన్న ఖండాలా ఒకటి . ఈ ప్రాంత సందర్సనలో ఎంతో ఉల్లాసం వేడుక నిండి ఉన్నాయి. లోహగడ్ అనే ఇనుపకోటను ఖైదీ లను బంధించేందుకు నిర్మించారు. ఖండాలా నగరానికి దగ్గరగా గల కునే జలపాతం 100 మీటర్ల ఎత్తు నుండి దుమికే ఒక యాత్ర విశేషం. ఇది మధురమైన పచ్చటి పరిసరాల మధ్య ఉంది. నిత్యం పచ్చటి లోయలు, తోటల మధ్య ఉండే రాజమచి కోట ఎవరు మరిచిపోలేని సందర్శనా విశేషం.  అపరిమిత ప్రాకృతిక అందాలతో నిండిన ఖండాలా లోని పర్యాటక ఆకర్షణలు ఎంతో అద్భుతమైనవి.

మరికొన్ని ఇతర వివరాలు

ఖండాలాలోని వాతావరణం ఏడాది పొడవునా విహారయాత్రకి అనువుగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం ఎక్కువగా వెచ్చగా, సౌకర్యవంతంగా ఉంటుంది.  అయితే శీతాకాలం సందర్శనకు ఉత్తమమైనది. ఈ పర్వత ప్రాంతం ఈర్ష్య కల్గించే చల్లని వాతావరణం తో విశ్రాంతిదినాల ఆనందాన్ని పెంచుతుంది. ఇక  పర్వతారోహణ అనుభవాలు జీవితాంతం మీ స్మృతి పధంలో మెదులుతాయని హామీ ఇవ్వవచ్చు

మీరు పరిమిత ఆర్ధిక వనరులతో వచ్చినా, ఖర్చుకు వెనకాడే వారు కాకపోయినా ఖండాలాలోని  దిగ్బ్రమపరిచే దృశ్యాలు, వాతావరణం మిమ్మల్ని మంత్రముగ్ధుల్నిచేస్తాయి. పలు రకాల వంటకాలకు ప్రసిద్ధి చెందిన ఖండాలాలో  ఫాస్ట్ ఫుడ్ ఆహారాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి.

విమాన, రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఖండాలా సులువుగా చేరవచ్చు. ముంబై, పూణే లను కలిపే ముంబై - పూణే ఎక్స్ ప్రెస్ ప్రధాన రహదారి ఖండాలా గుండా వెళ్తుంది. నగరాల నుండి ఖండాలాకు  ప్రయాణ సౌలభ్యం ఉండటంవల్ల విశ్రాంతికి, పర్వతారోహణకు ఆకర్షణీయమైన స్థలంగా మారింది . పూణే ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం కాగా, మహారాష్ట్ర లోని ఇతర ప్రధాన నగరాల నుంచి ఖండాలాకు రైళ్ళు నడుస్తాయి.

ఈ చిన్న అందమైన పర్వతప్రాంతం కొన్ని ప్రశాంత క్షణాలు సొంతం చేసుకోవడానికి ఉత్తమమైనది. భూమి పై ఉన్న ఈ చిన్న ప్రశాంత స్వర్గానికి చేరుకోవడానికి మీరు చేయవలసిందల్లా బస్సులో లేదా మీ కార్లో కేవలం 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించడమే.   

ఖండాలా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఖండాలా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఖండాలా

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? ఖండాలా

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం ముంబై, పుణే నుండి ఖండాలాకు బస్సు ప్రయాణం అనువుగా ఉంటుంది. ఇక్కడినుండి ఖండాలాకు చేరడానికి వరుసగా 4 గంటల, 2.5 గంటల సమయం పడుతుంది. ఖండాలా నుండి లోనవలకు బస్సులో కేవలం 15 నిముషాల్లో చేరవచ్చు. ముంబై లోని దాదర్ నుండి మహారాష్ట్ర రవాణా సంస్థకు చెందిన డీలక్సు, నాన్ డీలక్సు బస్సులు ఉంటాయి. పూణే, ముంబై నుండి ఖండాలాకు ప్రైవేటు బస్సు సౌకర్యం ఉంది.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం లోనావాల రైల్వేస్టేషన్ ఖండాలాకు దగ్గరగా ఉన్న స్టేషన్. పూణే, ముంబై నుండి ప్రతి రోజు స్థానిక రైళ్ళు వున్నాయి. లోనావాల నుండి 10 కిలోమీటర్ల దూరం ఉన్న ఖండాలాకు టాక్సీ చార్జీలు 200 రూపాయల వరకు ఉంటుంది.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయు మార్గం 66 కిలోమీటర్ల దూరంలోగల పూణే దేశీయ విమానాశ్రయం ఖండాలా కు దగ్గర మార్గం. 110 కిలోమీటర్ల దూరంలో గల చత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయం ఖండాలా చేరడానికి ప్రధాన మార్గం. ఈ రెండు విమానాశ్రయాల నుండి షుమారు 1500 రూపాయల నుండి 2500 రూపాయల చార్జీలతో టాక్సీలు దొరుకుతాయి. 143 కిలోమీటర్ల దూరంలో నాసిక్ లోని గాంధీనగర్, 193 కిలోమీటర్ల దూరంలో డయ్యు సమీపంలో ఉన్న ఇతర విమానాశ్రయాలు
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jan,Sun
Return On
30 Jan,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
29 Jan,Sun
Check Out
30 Jan,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
29 Jan,Sun
Return On
30 Jan,Mon