కోల్వా - ఫొటోగ్రాఫర్ల స్వర్గం!

ప్రసిద్ధి చెందిన కోల్వా బీచ్ దక్షిణ గోవా జిల్లాలో కలదు. నార్త్ గోవాలోని బీచ్ ల వలే కాకుండా కోల్వా బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. తెల్లటి ఇసుక తిన్నెలు. సుమారు 24 కిలోమీటర్ల తీరం ఉంటుంది. ప్రపంచంలోని అతి పొడవైన బీచ్ లలో కోల్వా బీచ్ ఒకటి.

దక్షిణ గోవా కూడా పార్టీలకు నైట్ కల్చర్ కు పేరు పడిందే. అయితే ఇక్కడి హోటళ్ళు, రెస్టరెంట్లు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. కోల్వా ఇక్కడే కల కొన్ని ప్రధాన హోటళ్ళకు సమీపంలో ఉంటుంది. అక్టోబర్ తర్వాత పర్యాటకులు కోల్వా చర్చి చూసేందుకు ప్రయాణం కడతారు. చాలామంది స్ధానికులు ఈ వేడుకలలో పాల్గొంటారు. కోల్వా నుండి పర్యాటకులు గోవాలో అతి పురాతనమైన కేబో డి రామా ఫోర్ట్ కు కూడా వెళ్ళవచ్చు.

కోల్వా బీచ్ క్యాబ్ లో లేదా అద్దె బైక్ లో చేరవచ్చు. పట్టణం నుండి సుమారు 40 కి.మీ.ల దూరం ఉంటుంది. కోల్వా బీచ్ మార్గాంవ్ రైలు స్టేషన్ కు దగ్గరగానే ఉంటుంది.       

Please Wait while comments are loading...