Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కండోలిం

కండోలిం   - గోవా లో  అసలైన స్వర్గం!

11

కండోలిం బీచ్ మధ్యస్తంగా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికి ప్రశాంతంగా కూడా ఉంటుంది. కాలన్ గూటే మరియు బాగా బీచ్ ల కంటే కూడా ప్రశాంతంగా ఉంటుంది. బీచ్ కేంద్రం అంటూ ఏదీ లేదు. కొద్దిపాటి షాక్స్ మరియు కొన్ని రెస్టరెంట్లు బీచ్ సమీపంలో ఉంటాయి. ఇక్కడ కల పరిశుభ్రత, నీటి ఆటలు మొదలైనవి మరచిపోలేని అనుభవాలు కలిగిస్తాయి.

తీరంనుండి కొద్దిగా బయటకు వెళితే, అందుబాటులో ఉండే రెస్టరెంట్లు, హోటళ్లు కలవు. గోవా వెళ్ళినపుడు బసకు ఈ ప్రదేశం అనువైనది. కండోలిం బీచ్ లో గత 12 సంవత్సరాలుగా రివర్ ప్రిన్సెస్ అనే ఓడ ఒకటి నిలిచి ఉంది. బీచ్ లో అడుగు పెడితే చాలు అందమైన ఇసుక తిన్నెలు కంటికి ఇంపుగా కనపడతాయి.

కండోలిం బర్డేజ్ బస్ స్టాండ్ కు దగ్గరగా ఉంటుంది. పనాజి నుండి 15 కి.మీ.లే కనుక క్యాబ్ లలో కూడా చేరుకోవచ్చు.    

కండోలిం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కండోలిం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కండోలిం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కండోలిం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Sep,Thu
Check Out
11 Sep,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri