గోకర్ణం - దేవాలయాలు, తెల్లటి ఇసుక తిన్నెలు

గోకర్ణం కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. ఇది ఒక యాత్రా స్ధలం మరియు అందమైన బీచ్ లు ఉండటంచే పర్యాటక స్ధలం అని కూడా చెప్పవచ్చు. ఇది రెండు నదుల అంటే అగ్నాషిని మరియు గంగావతి అనే రెండు నదుల మధ్యలో ఉంది. నదులు రెండూ కలిసి ఒక గోవు చెవి ఆకారంలో ఏర్పడతాయి కనుక దీనిని గోకర్ణం అంటే ఆవు చెవి గా వర్ణిస్తారు. గోకర్ణంలోని మహాబలేశ్వర శివ దేవాలయం హిందువులకు ప్రత్యేకించి శైవులకు ఎంతో పవిత్రమైంది. తమిళ కవులు అప్పార్ మరియు సంబంధార్ లు దీని గురించి తమ కవిత్వంలో ఎంతో వర్ణించారు. భగవానుడు తుళు నాయుడిని తమ పద్యాలలో కీర్తించారు.

ఈ ప్రదేశం విజయనగర రాజులు కాదంబాల ఆధీనంలో ఉండేది. తర్వాతి కాలంలో దానిని పోర్చుగీసు పాలకులు గెలుచుకున్నారు.

గోకర్ణం చరిత్ర ఎలా? గోకర్ణం లోని మహాబలేశ్వర దేవాలయ శివలింగం ఇక్కడకు రావణుడు తెచ్చినదిగా చెప్పబడుతుంది. రావణుడు శివుడి నుండి ఆత్మ లింగాన్ని పొందుతాడు. దీని ద్వారా రావణుడికి ప్రత్యేక మహిమలు వచ్చేస్తాయని, అతడు తమను మరింత పీడిస్తాడని భావించిన దేవతలు గణేశుడి సహాయంతో ఉపాయంగా ఆత్మ లింగాన్ని అక్కడ ప్రతిష్టించారు.  ఇక్కడ మహాబలేశ్వర దేవాలయమే కాక, ఇతర దేవాలయాలు, అంటే మహా గణపతి, భద్రకాళి, వరదరాజ, వెంకట రమణ దేవాలయాలు కూడా ఉన్నాయి.  

బీచ్ లు గోకర్ణంలో అనేక అద్భుత అందాలు కల బీచ్ లు ఉన్నాయి. ఇవి గోవా బీచ్ అందాలను కూడా తలదన్నుతాయి. కుడ్లే బీచ్, గోకర్ణ బీచ్, హాఫ్ మూన్ బీచ్, పారడైజ్ బీచ్, ఓం బీచ్ అని అయిదు ప్రధాన ఆకర్షణలున్నాయి.   గోకర్ణ బీచ్ ప్రధానమైంది. కుడ్లే బీచ్ అన్నిటికంటే పెద్దది. ఇక్కడ స్విమ్మింగ్ చేయటం ఎంతో ప్రమాదం. ఓం బీచ్ కోస్తా తీరం వెంబడి అందంగా ఉండి హిందూ పవిత్ర సంకేతం ఓం ను గుర్తు చేస్తుంది. ఈతకు అనుకూలం. స్నానాలకు చక్కటి ప్రదేశం. ఎంతో సుక్షితమైంది.  

హాఫ్ మూన్ బీచ్ చేరాలంటే ఓం బీచ్ నుండి ఇరవై నిమిషాలు పడుతుంది. ఒక కొండ చుట్టి దీని వద్దకు రావాలి. ఈ బీచ్ సగం చంద్రుడివలే ఉంటుంది కనుక దీనికి అర్ధాచంద్రాకార బీచ్ అని పేరు వచ్చింది. ప్యారడైజ్ బీచ్ లో అన్నీ రాళ్ళు అధికం. కొద్దిపాటి దూరంగా అందమైన ప్రదేశంలో ఉంది. ఈతకు అనుకూలం కాదు. అలలు తీవ్రంగా లేచి ఇబ్బంది పెడతాయి.  

గోకర్ణానికి యాత్రికులు, పర్యాటకులు ఇరువురూ వస్తూంటారు. అందమైన దేవాలయాలు, మరింత ఆకర్షణ కల బీచ్ లు గోకర్ణాన్ని ఆకర్షిత పర్యాటక ప్రదేశంగా మార్చాయి.

Please Wait while comments are loading...