హాఫ్ మూన్ బీచ్ గురించి చాలామందికి తెలియదు. ఉత్తర కన్నడ జిల్లా సందర్శకులు సమయం ఉందనుకుంటే కొద్దిమంది దీనిని సందర్శిస్తారు. ఓం బీచ్ నుండి కాలినడకన లేదా బోట్ లో ఇక్కడకు చేరాలి. ఈ రెండు బీచ్ లను వేరు చేస్తూ చిన్న కొండ ఉంటుంది. దీనిపై నుండి అరేబియా సముద్రం ఎంతో సుందరంగా కనపడుతుంది. ఈ బీచ్ పక్కన ఉన్న పూరి గుడిసెలు బీచ్ కు మరింత అందాన్ని తెచ్చి పెడతాయి. నీటి క్రీడలు ఇక్కడ లేవు. టూరిస్టులు పెయింట్ బాల్, వాలీబాల్, కేనోస్, కేబిన్స్, పెడల్ బోట్, కేంపింగ్, స్విమ్మింగ్ వంటివి చేస్తారు. పర్యాటకులు సన్ బేతింగ్ కూడా మధ్యాహ్న సమయాలలో చేసి ఆనందిస్తారు. రాత్రులు ఇసుక తిన్నెలపై పడుకుని ఆనందిస్తారు.