అగుంబే - నాగుపాముల రాజధాని

మహాకవి కువెంపు స్వంత పట్టణం అయిన తీర్ధహళ్ళి తాలూకాలో అగుంబే ఒక చిన్న గ్రామం. ఇది మల్నాడు ప్రాంతం క్రింద వస్తుంది. అరేబియా మహా సముద్రంలోకి సూర్యుడు అస్తమించే సుందర దృశ్యాలను ఈ ప్రదేశంనుండి చూసి ఆనందించవచ్చు. ఎన్నో సహజ అందాలు కల ప్రదేశం ఇది. దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాంతం అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేస్తుంది.  అగుంబే గురించిన కొన్ని ప్రాధమిక అంశాలు

ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు, వివిధ రకాల మొక్కలు జంతువులు ఉంటాయి. అగుంబేలో రెయిన్ ఫారెస్ట్ రీసెర్చి స్టేషన్ కలదు. ఔషధ మొక్కలకు ఇది ఒక రక్షిత స్ధావరం. ఎంతో ప్రశాంతంగా ఉండే ప్రదేశం కనుక దేశంలోని వివిధ ప్రాంతాలనుండి పర్యాటకులు వచ్చి విశ్రాంతి పొందుతారు. ఈ ప్రాంతంలో అందమైన జలపాతాలు ఎన్నో ఉన్నాయి.

3 చ.కి.మీల విస్తీర్ణంలో ఉన్న అగుంబే ప్రదేశంలో షుమారు 500 కంటే కూడా జనాభా మాత్రమే ఉంటుంది. వీరి జీవనాధారం అక్కడి అటవీ ఉత్పత్తులు మరియు పోక చెట్ల సాగు. ప్రకృతి ప్రియులకు ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ కూడా కలదు. ఎన్నో అటవీ జంతువులు చూడవచ్చు. అతి పెద్ద విషనాగులకు అగుంబే ప్రాంతం నిలయంగా ఉంది.   అగుంబే సందర్శనలో పర్యాటకులు బర్కానా మరియు కుంచికల్, ఒనకే అబ్బి ఫాల్స్ మరియు జోగిగుండి మరియు కూడ్లు తీర్ధ జలపాతాలు  జలపాతాలు కూడా చూడవచ్చు. ఈ ప్రదేశానికి రోడ్డు మరియు రైలు మార్గం కలదు. సమీప రైలు జంక్షన్ ఉడిపి. పర్యాటకులకు రుచికరమైన  స్ధానిక వంటకాలు లభిస్తాయి. ఇక్కడకు వచ్చే పర్యాటకుల బసకు ఇనస్పెక్షన్ బంగళా మరియు గెస్ట్ హౌస్ లు చౌక ధరలలో లభిస్తాయి.

Please Wait while comments are loading...