భద్ర - పచ్చదనాల భూతల స్వర్గం

భద్ర ప్రధానంగా ఒక వన్య ప్రాణుల సంరక్షణాలయం దీనినే భద్ర వైల్డ్ లైఫ్ శాంక్చువరి అని కూడా అంటారు. ఇది చిక్కమగళూరు జిల్లాలో ఉంది. పడమటి కనుమలలో ఉన్న ఈ అటవీ ప్రదేశం నపులుల సంరక్షణాలయం గా కూడా నిర్వహిస్తున్నారు.   ఈ శాంక్చువరీని 1958లో స్ధాపించారు. అప్పటినుండి ఎంతో అభివృధ్ధి సాధించి నేటికి అది అధిక విస్తీర్ణంతో భద్ర వైల్డ్ లైఫ్ శాంక్చువరీగా పేరొందింది. దీని విస్తీర్ణం సుమారు 492 చ.కి.మీ.లు. చిక్కమగళూరు పట్టణానికి ఇది 38 కి.మీ. బెంగుళూరు నగరానికి 282 కి. మీ. దూరంలో ఉంది.

ఈ అటవీ ప్రాంతంలో వివిధ జాతుల మొక్కలు, జంతువులు కూడా ఉన్నాయి. మొక్కల జాతులు సుమారు 120 రకాల వరకు ఉంటాయి. వాటిలో టేకు, రోజ్ వుడ్, బ్యాంబూ, జాక్ ఫ్రూట్ అంటే పనస వంటివి ప్రధానంగా కనపడతాయి.  జింకలు, సాంబర్, మచ్చల జింకలు, చిరుతలు, లేళ్ళు, దుప్పులు, మలబార్ ఉడుతలు, ఏనుగులు కూడా ఈ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాయి.

మొక్కలు తిని జీవించే జంతువులే కాక, మాంసాహారం తినే పులులు, అడవి క్కుక్కలు వంటివి కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. నక్కలు, ఎలుగుబంట్లు, ముంగీసలు, చిరుత పిల్లులు కూడా ఉన్నాయి. భద్ర ప్రాంతం ప్రాజెక్ట్ టైగర్ లో ఒక భాగంగా 1998 లో ప్రకటించారు. 250 పక్షి జాతులతో పక్షుల ప్రియులకు స్వర్గం గా ఉంటుంది. ఎన్నో చిలకలు, పావురాలు, వడ్రంగి పిట్టలు, మైనాలు, వివిధ రకాల అటవీ పక్షులు కనపడతాయి.

మీరు సరీసృపాలు ఇష్టపడేవారైతే, ఎన్నో రకాల పాములు, మొసళ్ళు, నాగుపాములు, వైపర్లు, సాధారణ పాములు, ర్యాట్ స్నేక్స్, పిట్ వైపర్లు, వంటివి కూడా చూడవచ్చు. రంగు రంగుల సీతాకోక చిలుకలు కూడా మీకు ఆహ్లాదాన్నిస్తాయి.

అటవీ శాఖ పర్యాటకులకు ట్రెక్కింగ్, క్యాంపింగ్, రాక్ క్లైంబింగ్, బర్డ్ వాచింగ్, బోటింగ్ సౌకర్యాలు కలిపిస్తుంది. భధ్ర నిశ్వబ్దంగా ఉండటమే కాదు, ఎన్నో సహజ అందాలు కూడా కలిగి ఉండటంతో మీకు జీవితంలో మరువలేని అనుభవాలు కలిగిస్తుంది.  

భద్ర నది ఉప శాఖలు భధ్ర గుండా ప్రవహిస్తాయి. చుట్టూ హెబ్బెగిరి, గంగే గిరి, మల్లయన గిరి, బాబా బూదాన్ గిరి వంటి కొండలు రమణీయంగా కనపడతాయి. పడమటి కనుమలలోని కుద్రేముఖ్ వద్ద మూలస్ధానంగా గల భద్రానది మూలాలను తప్పక చూడాల్సిందే. ఈ నది దక్కన్ పీఠభూమి గుండా ప్రవహించి దాని ఉపనదులతో సోమవాయిని ని తడబేహళ్ళ, హెబ్బె, ఒడిరాయన హళ్ళ వద్ద కలుస్తుంది.  లక్కవల్లి సమీపంలో భద్ర నదిపై డ్యామ్ కట్టారు. ఇక్కడనుండి అది భద్రావతి మీదుగా ప్రవహించి కూడ్లి వద్ద తుంగ నదితో కలుస్తుంది. ఇది శివమొగ్గ కు దగ్గరగా ఉంది.

Please Wait while comments are loading...