శివమొగ్గ లేదా షిమోగా - పర్వతాలు - జలపాతాల విహార ప్రదేశం!

షిమోగా అంటే అర్ధం ‘శివుడి యొక్క ముఖం’ అని చెపుతారు. ఈ పట్టణం బెంగుళూరుకు 275 కి.మీ. ల దూరంలో ఉంది. దీనిని స్ధానికులు మల్నాడ్ ప్రాంతం అని అంటారు. ఈ ప్రాంతం పశ్చిమ కనుమలకు ఆనుకుని ఇతర నగరాలతో రోడ్డు మరియు రైలు మార్గాలలో దేశంలోని ఇతర ప్రాంతాలతో బాగా కలుపబడింది.  

షిమోగా కు సంబంధించిన కొన్ని వాస్తవాలు ఈ జిల్లాగుండా షుమారు అయిదు ప్రధాన నదులు ప్రవహిస్తాయి. కనుక షిమోగా ఎంతో సారవంతమైన భూమి అని, కర్నాటక రాష్ట్రానికి అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు. సహ్యాద్రి పర్వతాలు నిరంతరం వర్షపాతం కలిగి సంవత్సరంకు సరిపడా కర్నాటక రాష్ట్ర ప్రజలకు వర్షాలనిస్తాయి.

స్ధానికులు షిమోగా ప్రాంతాన్ని భూమిపై అవతరించిన స్వర్గంగా పిలుస్తారు. ఈ ప్రాంతం అందరికి అన్నిఅవసరాలను ప్రసాదిస్తుంది. పర్యాటకులకు, యాత్రికులకు వీనుల విందు చేసే దేవాలయాలు, ఎత్తైన కొండలు, పచ్చటి పచ్చిక మైదాన ప్రాంతాలు, ప్రపంచ ప్రఖ్యాత జోగ్ ఫాల్స్ వంటి జలపాతాలు ఇక్కడ ఉన్నాయి. జోగ్ ఫాల్స్ దేశంలోనే అతి పెద్ద జలపాతాలుగా చెపుతారు.  

పర్యాటకులకు విశేషంగా కనపడేవి?    షిమోగా ప్రాంతం కర్నాటకలోని ప్రధాన పర్యాటక స్ధలాలలో ఉండటం చేత పర్యాటకులు ముందుగా షిమోగా చూసేందుకు ఇష్టపడతారు.  

అగంబే - అగంబే ప్రాంతం షిమోగా నగరానికి 90 కి.మీ. ల దూరంలో ఉంటుంది. జిల్లాలో ఒక భాగమైనప్పటికి ఇది సూర్యాస్తమయానికి ప్రసిద్ధి. పర్యాటకులు దట్టమైన అటవులు, లోయలు, నదులు, జలపాతాలు కల ఈ ప్రాంతంలో సూర్యాస్తమయం చూసేటందుకు ఎంతో ఆసక్తిగా వస్తారు.

15 కిలో మీటర్ల దూరంలో ఉన్న గాజనూర్ లోని తుంగ నదిపై నిర్మించిన డ్యాము ఒక పిక్ నిక్ ప్రదేశం. త్యవరికొప్పలో అడవి జంతువులను చూడాలనుకునే వారికి సింహాలు బాగా కనపడతాయి. షిమోగా నుండి 28 కి.మీ. ల దూరంలో భద్ర నదిపై షుమారు 200 అడుగుల పొడవైన డ్యామ్ మరో ఆకర్షణగా ఉంటుంది.  

ఇక్కడకు 100 కిలో మీటర్ల దూరంలో ప్రఖ్యాతి గాంచిన శృంగేరి శారద మఠం, ఆది శంకరులు స్ధాపించిన నాలుగు మఠాలలో ఒకటిగా ఇక్కడ విరాజిల్లుతోంది. ఈ పీఠాలను ఆది శంకరులు హిందూమతాన్ని బుద్ధిజం, జైనిజం లనుండి రక్షించటానికిగాను ఆనాడు స్ధాపించారు. వాటిలో  శృంగేరి  శారద మఠం ఒకటి. ఈ మఠానికి ప్రతి ఏటా లక్షలాది యాత్రికులు వస్తూ ఉంటారు.

పశ్చిమ కనుమలు పర్వత సందర్శకులకు ఒక అపురూప అనుభవాన్ని ఇస్తాయి. అగంబే ప్రాంతం ఇండియాలో రెండవ అత్యధిక వర్షపాత ప్రాంతంగా చెపుతారు. ఇక్కడ ఒక రెయిన్ ఫారెస్ట్ రీసెర్చి సెంటర్ కూడా ఉంది. ఈ ప్రాంతం తాచు పాములు లేదా కింగ్ కోబ్రాలకు ప్రసిద్ధిగా చెపుతారు.

షిమోగా చూడాలంటే జూలై నుండి జనవరి నెలవరకు మంచి అనుకూల సమయం. నదులు, జలపాతాలు ఈ వర్షాకాల సమయంలో కళ కళ లాడతాయి. కన్నుల విందుగా ఉంటుంది.  ఇక్కడ ఎన్నో హోటళ్ళు మరియు రిసార్టులున్నాయి. ప్రతి ఒక్కరి బసకు తగిన ధరలలో లభించే హోటళ్ళు, రెస్టరెంట్లతో షిమోగా ఎంతో సౌకర్యమైన ప్రదేశం.

Please Wait while comments are loading...