బైందూర్ - వెచ్చని సూర్య రశ్మి, ఇసుక తిన్నెలు, సముద్రం

బైందూర్ పేరు చెపితే అన్నీ బీచ్ లు మరియు అందమైన సూర్యాస్తమయాలు అంటారు. ఈ విహార ప్రదేశం కర్నాటకలోని ఉడుపి జిల్లా కుందాపురలో ఉంది. ఈ కుగ్రామం శ్రీ సోమేశ్వర దేవాలయానికి ప్రసిద్ధి. ఈ దేవాలయం శివభగవానుడిది. సరిగ్గా సముద్రపు ఒడ్డున ఉంది. అద్భుతమైన శిల్పాలు, గుడిలో లింగం చూడదగిన అంశాలు.

బైందూర్ లో చూసేవి ....చేసేవి ఏమిటి? అందమైన బీచ్ కల బైందూర్ గ్రామం అనేక ఇతిహాసాలతో సంబంధం కలిగి ఉంది. ఈ ప్రదేశానికి, ఈ గ్రామంలోని ఒట్టినెనె కొండ వద్ద ఘోర తపస్సు చేసిన రుషి బిందు పేరుతో బైందూర్ గా ఏర్పడింది. ఒట్టినెనె కొండ ఎక్కి సముద్రం, బీచ్ మరియు సూర్యాస్తమయం వంటివి చూసి ఆనందించవచ్చు.

బైందూర్ వద్ద మరో ప్రసిద్ధి గాంచిన యాత్రా స్ధలం కొల్లూరు శ్రీ మూకాంబిక దేవాలయం. మరావంతే మరియు మురుడేశ్వర పుణ్యక్షేత్రాలు కూడా సమీపంలో ఉంటాయి. మరావంతేలో ఒక బీచ్, మురుడేశ్వర దేవాలయానికి మూడువైపుల సముద్రం  ఉంటాయి.

బైందూర్ వాతావరణం, సాధారణంగాను ఆహ్లాదంగాను ఉంటుంది. ఆగస్ట్ నుండి మార్చి వరకు పర్యటనకు అనుకూలం. బైందూర్ కు రైలు సౌకర్యం కలదు. బెంగుళూరు నుండి 480 కిలో మీటర్ల దూరం ఉంటుంది. బెంగుళూరు, మంగుళూరుల నుండి ఈ గ్రామానికి ప్రయివేటు బస్సులు కూడా నడుస్తాయి.

Please Wait while comments are loading...