ఉడుపి నుండి 92 కి.మీ. దూరంలో సహజ అందాల ప్రదేశంలో క్షితిజ నేసర ధామ ఉంటుంది. ఈ ప్రదేశంలో ఎన్నో తాటి మరియు కొబ్బరి చెట్లు అందాలను విరజిమ్ముతూంటాయి. మరోవైపు నింగి నేల కలసినట్లు కనపడుతూంటాయి. ఈ ధామం ఒక చిన్న కొండపైన ఉండి అరేబియా సముద్రాన్ని చూస్తూ ఉంటుంది. ఈ ధామ ప్రస్తుతం అటవీ శాఖ నిర్వహిస్తోంది. పర్యాటకులకు దీనిలో విశ్రాంతి గదులు, ఒక క్యాంటీన్ వంటివి లభిస్తాయి. విశ్రాంతి గదుల బాడుగ తినుబండారాల ధరలు తక్కువగానే ఉంటుంది.
బైందూర్ వాతావరణం ఆనందించాలనుకునేవారు ఈక్షితిజ నేసర ధామలో తప్పక బస చేస్తారు.