కుక్కే సుబ్రమణ్య – నాగదేవత నివసించే ప్రదేశం !

కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని సుల్లియా అనే ఊళ్ళో కుక్కే సుబ్రమణ్య దేవాలయం వుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ నాగ దేవతగా ఆరాధించడం విశేషం. ఇది ఒక ప్రసిద్ధ యాత్రా స్థల౦ – ఇక్కడి క్షేత్ర గాధ కూడా  యాత్రికుల్ని ఇక్కడికి ఆకర్షిస్తుంది.

పురాణ గాధ 

వాసుకి శివుడిని ప్రార్ధించి, గరుత్మంతుడి నుంచి నాగ జాతి ని కాపాడమని వేడుకున్న ప్రదేశం లో ఈ గుడి నిర్మించారని పురాణ గాధ చెప్తుంది. ఈ తపస్సుకు మెచ్చిన శివుడు సుబ్రహ్మణ్య స్వామి ని నాగజాతిని రక్షించ డానికి పంపాడు, అప్పటి నుంచి ఆయన్ను నాగ జాతి రక్షకుడిగా కొలుస్తున్నారు.

గరుత్మంతుడి గోపురం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ వెండి గోపురాన్ని వాసుకి బుసల్లోంచి వచ్చే విష వాయువుల నుంచి భక్తులను కాపాడడానికి నిర్మించారు. వాసుకి ఈ గుళ్ళో వుంటాడని నమ్ముతారు. ఆశ్లేష బలి, సర్ప సంస్కారం ఈ గుళ్ళో జరిగే ప్రధాన పూజలు.

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం  వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. మంగళూరు దగ్గరలోని  విమానాశ్రయం. గుడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ వుంది.  బెంగళూరు, మంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం వరకు చాలా ప్రభుత్వ బస్సు సేవలు అందుబాటులో వున్నాయి.

Please Wait while comments are loading...