Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» దేవరాయనదుర్గ

దేవరాయనదుర్గ -  ఆలయాలు, అడవులు

11

చుట్టూ పరచుకున్న పచ్చని అడవుల మధ్య దేవరాయనదుర్గ లోని రాతి కొండలు ఈ ప్రాంత సందర్శన ను ఆహ్లాదకరంగా మారుస్తాయి. 3940 అడుగుల ఎత్తులో వుండడం వల్ల ఈ ప్రాంతంలోని వాతావరణం కట్టి పడేస్తుంది.

దేవరాయనదుర్గ, కర్ణాటకలోని తూమ్కుర్ జిల్లలో ఉంది, అక్కడి ఆలయాలు, అడవులు అలాగే అద్భుతమైన వాతావరణం, అక్కడి అందమైన దృశ్యాలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి.

దేవరాయనదుర్గను  వోడేయార్లు పాలించారు – జడక అనే ఒక సామంత రాజును ఓడించి ఈ పట్టణాన్ని చేజిక్కించుకున్న చిక్క దేవరాజ వడేయార్ రాజు పేరిట ఈ ఊరు ఏర్పడింది.

దేవరాయనదుర్గలో గుర్తుంచుకోవలసిన స్థలాలు

ఈ కొండ ప్రాంతం లో భోగనరసింహ, యోగనారసింహ, లక్ష్మీ నరసింహ దేవాలయాలు వున్నాయి. దేవరాయనదుర్గ లో మూడు ప్రత్యేకమైన ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయి. యోగనారసింహ విగ్రహం కొండ పైన ఉంటె, భోగనరసింహ ఆలయం కొండకింద ఉంది. లక్ష్మి నరసింహ దేవాలయం మొదటి ఎత్తులో ఉంది.

ఇక్కడి మరొక ఆకర్షణ సహజ నామద చిలుమే బుగ్గ. స్థానిక పురాణం ప్రకారం రాముడు తన విల్లు నుండి భూమి మీదకు బాణాన్నిసంధించినపుడు ఈ బుగ్గ నీటిని స్రవించింది. ఈ బుగ్గ సమీపంలోని నేలపై రాముని పాదముద్రలు ఉన్నాయని భక్తుల విశ్వాసం. ఈ అడవులలో అరుదైన ఆయుర్వేద మొక్కలు పండించే నర్సరీ ఉంది, ఇక్కడ రథోత్సవం, శ్రీ నరసింహ జయంతి చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు.

దేవరాయనదుర్గ, బెంగళూర్ నించి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి తూమ్కుర్ దగ్గరి రైల్వే స్టేషన్. ఈ ప్రాంతం నించి అనేక బస్సులు కూడా ఉన్నాయి.

దేవరాయనదుర్గ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దేవరాయనదుర్గ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దేవరాయనదుర్గ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దేవరాయనదుర్గ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా: బెంగళూర్ నించి దేవరాయనదుర్గను చేరుకోవడానికి అనేక ప్రైవేట్, రాష్ట్ర, ఎయిర్ కండిషన్డ్, డీలక్స్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా: దేవరాయనదుర్గ కి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న తూమ్కుర్ రైల్వే స్టేషన్ సమీప రైల్వే జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ భారతదేశం లోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు అనుసంధానించబడి ఉంది. బెంగళూర్, ఢిల్లీ, ముంబై, మైసూర్ మరి కొన్ని ఇతర నగరాలనుండి తూమ్కుర్ వెళ్ళడానికి రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణీకులు ఇక్కడ నించి దేవరాయనదుర్గ చేరుకోవడానికి టాక్సీలు బాడుగకు తీసుకొనవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    బెంగళూర్ కి చేరువలో ఉన్న ఈ దేవరాయనదుర్గ ని రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా సందర్శించడం చాలా సులభం. వాయు మార్గం: పర్యాటకులు ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కత్త వంటి అనేక నగరాల నుండి సమీపంలోని బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేవరయనదుర్గను చేరుకోవచ్చు. దేవరాయనదుర్గ నుండి 71 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం యురోపియన్, ఆసియా, అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలు, అంతర్జాతీయ గమ్యస్థానాల నుండి వచ్చే పర్యాటకులకు కూడా ఇది సరైన మార్గం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Jul,Sat
Return On
12 Jul,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Jul,Sat
Check Out
12 Jul,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Jul,Sat
Return On
12 Jul,Sun