Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దేవరాయనదుర్గ » వాతావరణం

దేవరాయనదుర్గ వాతావరణం

వాతావరణం దేవరాయనదుర్గ, కర్ణాటక తూమ్కుర్ జిల్లాలోని ఒక చిన్న పర్వత కేంద్రం. ఈ కొండ ప్రాంతంలో సంవత్సరం మొత్తమ్మీద వాతావరణం ఒక మోస్తరుగా వుండి, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పర్యాటకులు వేసవిలో అధిక ఉష్ణోగ్రత నించి తప్పించుకోవడానికి ఈ ప్రదేశానికి విరివిగా వస్తారు. సరైన సమయం: దేవరాయనదుర్గని సంవత్సరంలో ఏ సమయంలోనైన సందర్శించవచ్చు. అయితే, శీతాకాలం ఈ అందమైన హిల్ స్టేషన్ సందర్శించడానికి ఉత్తమ సమయం.

వేసవి

  వేసవి (ఏప్రిల్ నించి జులై వరకు): దేవరాయనదుర్గలో సాధారణంగా వేసవి ఉష్ణోగ్రత 25౦ C నుండి 310 C వరకు ఉంటుంది. ఈ కొండ ప్రాంతం వేసవిలో ఎంతో ఆహ్లాదకరమైన, చల్లని వాతావరణాన్ని కలిగిఉండటం వల్ల పర్యాటకులు ఈ కాలంలో దీనిని సందర్శించడానికి ఇష్టపడతారు.  

వర్షాకాలం

వర్షాకాలం (ఆగస్ట్ నించి అక్టోబర్ వరకు): వేసవి తరువాత వర్షాకాలం, ఆ సమయంలో ఇక్కడ భారీ వర్షపాతం ఉంటుంది. ఈ కాలంలో ఇక్కడ పర్యాటకులకు అనుకూలంగా ఉండదు కనుక అప్పుడు పర్యాటకులు ఇక్కడకు రావడానికి ఇష్టపడరు.  

చలికాలం

శీతాకాలం (నవంబర్ నించి మార్చ్ వరకు): ఈ కాలంలో దేవరాయనదుర్గ లో వాతావరణం చాల ప్రశాంతంగా, సాధారణంగా ఉంటుంది. ఇక్కడి ఉష్ణోగ్రతలు 180 C నుంచి 240  C వరకు ఉండడం వల్ల ఈ రమణీయ పర్వతాలను సందర్శించడానికి ఇది అనువైన సమయం.