బండిపూర్ - దట్టమైన అడవుల ఆనందం!

ఇండియాలో పులులు అధికంగా ఉండే ప్రదేశాలలో బండిపూర్ అటవీ ప్రాంతం ఒకటి. దీనిలో షుమారుగా 70 పులుల వరకు ఉంటాయని ప్రతీతి.   అది మైసూర్ కు 80 కి.మీ.  బెంగుళూరుకు 220 కి. మీ. దూరంలో ఉంది. ఈ రెండు నగరాలనుండి రోడ్డు ప్రయాణం తేలికగా చేయవచ్చు.

మరి ఈ ప్రాంతం గురించి ఏం తెలుసుకోవాలి?  బండిపూర్ లో గల ఈ రిజర్వు అటవీ ప్రాంతం కొన్ని చోట్ల అంటే తమిళనాడులోని మదుమలై మరియు కేరళలోని వయనాడ్ ప్రాంతాలకు కూడా కలుపబడి ఉంది. ఈ ప్రాంతాలు కూడా కలుపుకుంటే, దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద అటవీ సంరక్షణా ప్రదేశంగా చెప్పవచ్చు. ఇది ప్రఖ్యాత సైలెంట్ వ్యాలీ కల నీలగిరి రిజర్వు అటవీ ప్రాంతంలో భాగంగా కూడా ఉంది.

కాబిని నది ఒడ్డున ఉన్న ఈ బండిపూర్ అటవీ ప్రాంతం చిరుత, ఎనుబోతు, వివిధ రకాల జింకలు, అడవి ఏనుగులు, అడవి ఎలుగుబండి, నక్కలు, మొదలైన జంతువులకు నిలయంగా ఉంది. కాబిని నదిలోకి వచ్చే వాగులు, వంకలు వంటి నీటి ప్రవాహాలు ఈ అడవిలోని జీవాలకు ఆధారంగా ఉంటాయి. రాబిన్స్, అడవి కోడి, పావురాలు, గుడ్లగూబలు, నెమళ్ళు వంటి వివిధ పక్షులు కూడా ఈ ప్రాంతంలో చూడవచ్చు. ఈ ప్రాంతం గంధపు వృక్షాలకు ప్రసిద్ధి చెందటం చేత, గంధపు చెక్కలు, రోజ్ వుడ్, మరియు టేకు వంటి ఉత్తమ కలప కూడా లభ్యం అవుతుంది. ఈ చెట్లు ఇక్కడి జీవజాలానికి ఆశ్రయం కల్పిస్తూ పచ్చటి వాతావరణంలో అతి సహజంగా ఉండి అనేక రకాల లమొక్కలు కూడా పెరిగేలా చేస్తాయి. బల్లులు, పాములు, నాగుపాములు, సాధారణ విష సర్పాలు, ఎలుకలు, వివిధ రకాల బల్లులు, ఊసర వెల్లులు కూడా బండిపుర ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాయి. 

రోజులో ఉదయం వేళ లేదా సాయంకాలాలలో ఈ ప్రాంతాలను సందర్శించవచ్చు. ఆ సమయాలలో అనేక జంతువులు వాటి దప్పిక తీర్చుకొనేటందుకు నీటి చెలమల వద్దకు వస్తాయి. ఆసక్తికల సందర్శకులకు జీపులు వంటివి లభ్యంగా ఉంటాయి. లేదా అటవీ శాఖ చే నిర్వహించబడుతున్న బస్ ట్రిప్ లలో సందర్శించవచ్చు. ప్రయివేటు వాహనాలను ఇది ఒక రక్షిత ప్రాంతం అయిన కారణంగా ఈ ప్రాంతంలో నిషేధిస్తారు.

ఈ అడవిలో రాత్రి బసకుగాను లాడ్జిలు, రిసార్టులు, హోటళ్ళు ఉన్నాయి. పర్యాటకులు అదనంగా దర్శించేందుకు ఈ ప్రాంతంలో గోపాలస్వామి బెట్ట గుడి మరియు కాబిని డ్యామ్ వంటివి కూడా ఉన్నాయి.

మీరు కనుక నిశ్శబ్ద వాతావరణాలు ఇష్టపడి అటవీ ప్రాంతంలో మీ సెలవు దినాలు గడపాలనుకునేవారైతే, మీరు తప్పక కర్నాటక లోని బండిపుర సందర్శించాల్సిందే. అది మీకు తగిన ప్రదేశం కాగలదు.

Please Wait while comments are loading...