Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కావేరి ఫిషింగ్ క్యాంప్

కావేరి ఫిషింగ్ క్యాంప్ - ప్రకృతి ప్రేమికుల ఆకర్షణ

6

దక్షిణ కర్ణాటక అడవుల నడుమ గంభీరంగా ప్రవహించే కావేరి నది వెంట కావేరి ఫిషింగ్ క్యాంప్ ఉంది.  ఇక్కడి అరణ్య వాతావరణం, ప్రశాంతత ప్రకృతి ప్రేమికులను తేనెటీగల్లా ఆకర్షిస్తుంది. బిజీగా ఉండే రోజువారీ జీవితం నుంచి ఇది చక్కటి ఆటవిడుపు – సాహసం, సరదా, ప్రశాంతత అన్నే సమపాళ్ళలో ఇది పర్యాటకులకు అందిస్తుంది.

మాండ్యా జిల్లాలో వున్న ఈ కాంప్ బెంగళూర్-కొల్లేగల జాతీయ రహదారిపై రాజధాని బెంగళూరు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. హగాలుర్ నించి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఫిషింగ్ క్యాంప్ ను కర్ణాటక అటవీ వసతి గృహాలు, రిసార్ట్స్ వారు నిర్వహిస్తున్నారు.

ఫిషింగ్ శిబిరం గురించి కొన్ని ప్రాధమిక అంశాలు

కావేరి ఫిషింగ్ క్యాంప్ భీమేశ్వరి, గలిబోరే, దొడ్డమాకలి అనే మూడు శిబిరాలను కలిగి ఉంది. భీమేశ్వరి, గలిబోరే శిబిరాలు పర్యాటకులను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసినది, దొడ్డమకలి ఫిషింగ్ క్యాంప్ కేవలం కార్పోరేట్ విహార కేంద్రంగా తీర్చిదిద్దారు.

ఈ మూడు కాంప్ లు ప్రాధమికంగా ఫిషింగ్, ప్రాకృతిక శిబిరాలు. భీమేశ్వరి నుండి గలిబోరే వద్ద శిబిరం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఐతే, అదే ప్రదేశం నుండి దొడ్డమకలి వద్ద 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంతో పురాతనంగా, ఎగుడుదిగుడుగా ఉన్న ఈ ప్రదేశాలు నగరానికి దూరంగా మీ సమయాన్ని ఆస్వాదించడానికి  వీలు కల్పిస్తాయి. .

మీరు ఎక్కడినుండి వస్తున్నారో దానిమీద ఆధారపడి రోడ్డు లేదా వాయుమార్గం, రైల్, రోడ్డు ప్రయాణాల మేళవింపు  ద్వారా ఈ శిబిరాన్ని చేరుకోవచ్చు. దీనికి సమీప విమానాశ్రయం బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయం, సమీప రైల్వే జంక్షన్ మైసూర్ లో ఉంది. మరింత సరదాగా వెళ్ళాలంటే ప్రైవేటు వాహనాల్లో వెళ్ళవచ్చు.

ఇక్కడ శిబిరాలు దుంగలతో చేసిన గుడిసెలు, డేరా సౌకర్యాలను కలిగిఉంటాయి. ఈ సౌకర్యాలు బైటనుండి చూడడానికి చాలా పురాతనంగా ఉన్నప్పటికీ, లోపల మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో పొందే సౌకర్యాలనే పొందుతారు. దుంగల గుడిసెలు, గుడారాలు చాల బాగా నిర్వహించబడతాయి - గాలిబోరే, దొడ్డమకలి ల లో విద్యుత్ దీపాలు అందుబాటులో ఉండవు, హరికేన్ దీపాలు లేదా సౌర దీపాలపై ఆధారపడి పనులు జరుగుతాయి. ఈ ఫిషింగ్ శిబిరాన్ని సందర్శించడానికి డిసెంబర్ నుండి మార్చ్ మధ్య సమయం సరైన సమయం.

ఫిషింగ్ క్యాంప్ వద్ద చేయగల కార్యకలాపాలు

గుంపులు గుంపులుగా దొరికే మహాసీర్ రకం చేపల కోసం ఇక్కడ ప్రధానంగా ఫిషింగ్  చేస్తారు. చేపల సంఖ్య తగ్గుముఖం పట్టడం వల్ల ఇక్కడ సందర్శకులు చేపలు పట్టి, వెంటనే వదలివేసి ప్రక్రియ ద్వారా వినోదం పొందుతూ వుంటారు – అలా పట్టి వదలి వేసినవి ఎన్నో లెక్క పెట్టుకుని సరదా పడుతుంటారు.  

ఇక్కడ ట్రెక్కింగ్, కయకింగ్, కొరకిల్ సవారీ, పర్వత బైకింగ్ లాంటి కొన్ని కార్యకలాపాలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. ఈ కార్యకలాపాలతో పాటు మీరు దీని చుట్టూ 95 జాతుల పక్షులు, మొసళ్ళు, తాబేళ్లు కూడా చూసి ఆనందించవచ్చు.

మీరు విహార యాత్రాలంటే ఇష్టపడే వారైతే ఈ ప్రదేశం ఒక చక్కటి ఆటవిడుపు

కావేరి ఫిషింగ్ క్యాంప్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కావేరి ఫిషింగ్ క్యాంప్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కావేరి ఫిషింగ్ క్యాంప్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కావేరి ఫిషింగ్ క్యాంప్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా రోడ్డు ద్వారా ఈ సిబిరాలని చేరుకోవడానికి ప్రైవేట్ కార్లు, కాబ్స్ అద్దెకు తీసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం రైలు ద్వారా కావేరీ ఫిషింగ్ శిబిరానికి రైల్వే స్టేషన్ లేదు. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూర్ సిటీ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఈ శిబిరానికి దగ్గరి స్టేషన్.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    చేరుకోవడం ఎలా వాయు మార్గం ద్వారా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ సిబిరాలకు సమీప విమానాశ్రయం. అది ఇక్కడి నుండి 107 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun