Search
  • Follow NativePlanet
Share

దుబరే - ఏనుగుల శిక్షణా కేంద్రం

14

కర్నాటకలోని దట్టమైన అడవులు కల దుబరే ఏనుగుల గుంపులకు ప్రసిద్ధి. సున్నితమైన ఏనుగులతో పర్యాటకులు సన్నిహిత అనుభవాలను పొంది ఆనందించవచ్చు. దుబరే అటవీ సంరక్షణ కావేరి నదీ తీరంలో కూర్గ్  లో కలదు. ఎంతో కాలంనుండి ఈ ప్రదేశం ఏనుగుల శిక్షణాలయంగా చెప్పబడుతోంది. మైసూరు మహారాజుల పాలనా కాలంలో రాజుల ఏనుగులు ఇక్కడ శిక్షణ పొందేవి. ఈ శిక్షణ పొందిన ఏనుగులను దసరా పండుగల వేడుకలలో మైసూర్ మహారాజులు పాల్గొన చేసి ఆనందించేవారు.   దుబరే లో వన్య జీవులు

దుబరేలోని దట్టమైన అడవులు ఎన్నో రకాల వన్యజీవులకు అంటే ఏనుగులనుండి, చిన్నపాటి జింకలవరకు ఆశ్రయంగా ఉన్నాయి. చిరుతలు, పులులు, జింకలు, అడవి కుక్కలు మొదలైన జంతువులకు ఈ ప్రాంతం ఒక స్వర్గంలా ఉండి స్వేచ్ఛగా విహరిస్తాయి.  

గతంలో అటవీ శాఖ ఏనుగులను కలప రవాణాకు వినియోగించేది. ఇపుడు ఆ ఏనుగులు పర్యాటకులకు ఆనందం కలిగించేవిగా ఉన్నాయి. ఏనుగుల గురించి తెలియచెప్పేందుకు, వినోదం కలిగించేందుకు ప్రభుత్వ అటవీ శాఖ మరియు జంగిల్ లాజస్ అండ్ రిసార్ట్స్ సంస్ధ రెండూ కలిసి ఏనుగుల కేంపులను దుబరేలో నిర్వహిస్తున్నాయి.  ఏనుగులు లేకుంటే మన పర్యావరణ ప్రభావం ఎలా ఉంటుంది అనే దానిపైనా, మరియు పర్యాటకులు వారి స్వహస్తాలతో ఏనుగులకు ఆహారం అందించటం, వారి స్వంత అనుభవ ఆనందాలను వివరించటం వంటి వివిధ  అంశాలపై  ప్రభుత్వ అటవీ శాఖ ఏనుగుల  జంగిల్ సఫారీలను నిర్వహిస్తోంది.

ఈ అడవిలోని కొండ ప్రాంతం, ట్రెక్కింగ్ మరియు ర్యాఫ్టింగ్ లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ అందమైన అనేక ట్రెక్కింగ్ మార్గాలు కలవు. వాటగిలో ఒకటి ఇరుప్పా జలపాతాలకు కూడా దోవ తీస్తుంది.

దుబరే ఒక మంచి విహార స్ధలం. ఎన్నో ఆకర్షణలు, క్రీడలు కలిగి ఉంటుంది. ఇది కొడగు లేదా కూర్గ్ కు సమీపంలో ఉండటంచే తేలికగా అక్కడకు చేరవచ్చు. ఈ ప్రాంతాన్ని బెంగుళూరు మరియు మైసూరుల నుండి కూడా చేరవచ్చు.  

దుబరే ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దుబరే వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దుబరే

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దుబరే

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం కూర్గ్ నుండి కర్నాటకలోని అన్ని జిల్లాలకు, పొరుగునగల కేరళ రాష్ట్రంలోకి బస్ సౌకర్యాలున్నాయి. మంగుళూరు, హాసన్, బెంగుళూరు, కన్నూర్, తలస్సెరి, వయనాడు మొదలైన పట్టణాలకు కూర్గు నుండి చక్కటి రోడ్డు మార్గాలు కలవు. మంగుళూరు నుండి సంపగి-మడికెరి ఘాట్ రోడ్డు, కన్నూరు నుండి మకుట్ట-పెరుంబాడి విరాజ్ పేట ఘాట్ రోడ్డు, కన్హన్గడ్ మరియు కాసరగోడ్ నుండి పణతూర్-భాగమండల ఘాట్ రోడ్డు కూర్గు పట్టణం చేరేందుకు పటిష్టమైన రోడ్లు కలిగి ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం కూర్గ్ పట్టణానికి రైలు స్టేషన్ లేదు. కూర్గ్ కు సమీప రైలు స్టేషన్ మంగుళూరు, మైసూర్ మరియు హసన్ లలో కలవు. కేరళలోని తలస్సెర్రీ మరియు కన్నూర్ రైలు స్టేషన్లు దగ్గర. ఈ రైలు స్టేషన్ల ద్వారా కూర్గ్ పట్టణం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కలుపబడింది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం మైసూరు మరియు మంగుళూరు విమానాశ్రయాలు కూర్గ్ కు సమీపంగా ఉంటాయి. మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 172 కి.మీ. ల దూరంలో ఉంటుంది. విరాజ్ పేట నుండి మడికెరి 140 కి.మీ.ల దూరం ఉంటుంది. మైసూర్ విమానాశ్రయంకు విరాజ్ పేట 115 కి.మీ.లు మడికెరికి 130 కి.మీ.లు ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Aug,Thu
Check Out
21 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri