బేలూర్ - ఆలయాలకు నెలవు

బేలూర్ కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రదేశము . అనేక  ఆలయాలకు నెలవైన ఈ  పట్టణం హసన్ జిల్లా లో బెంగుళూర్ నుండి కేవలం  220 కి. మీ. ల  దూరంలో  ఉంది. ఇది యగాచి నది ఒడ్డున కలదు , దీని ప్రాచీనమైన, విశిష్టమైన దేవాలయల వలన దీనిని అందరు దక్షిణ కాశి అంటారు.

దీని చారిత్రక ప్రాధాన్యత.

బేలూర్ హొయసల సామ్రాజ్య  రాజధానిగా ఉంది కనుక చారిత్రకంగా బేలూర్ విశిష్టమైనది.  ఇక్కడికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హలేబిడ్   కూడా హొయసల  రాజధానిగా ఉంది ఇది పురాతన నగరం. ఈ రెండు నగరాలు  హొయసల నిర్మాణ ప్రతిభకు   ప్రసిద్ధ ఉదాహరణలు - తరచుగా యాత్రికులు ఈ రెండు నగరాలను ఒకే సారి దర్శిస్తూ ఉంటారు  .

బేలూర్ లో అన్నిటికన్నా గొప్ప ఆలయ సముదాయం నిస్సందేహంగా చెన్నకేశవ ఆలయం.  విష్ణు భగవానుడి కోసం నిర్మించిన ఈ ఆలయం గాలిగోపురం  ఎత్తు ఎంతొ  ప్రసిద్ధి చెందినది . ఈ ఆలయం లోని రక రకాల శిల్పాలు ఎంతొ  సజీవంగా ఉన్నాయా అన్నంత బాగుంటాయి.

ఆలయం దక్షిణ భారత నిర్మాణ శైలి లోని అందానికి   ఉదాహరణగా నిలుస్తుంది .  ఈ  సంక్లిష్టమైన కట్టడం నిర్మించడానికి ఒక శతాబ్దం కంటే  ఎక్కువ కాలం పట్టింది . బేలూర్ వద్ద చూడదగిన  ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో దొడ్డ గాదవల్లి లోని లక్ష్మీ దేవి ఆలయం. శ్రావణ బెలగోళ లో వున్న  జైన్ స్మారక మందిరము  ఉన్నాయి.బేలూర్  రైలు, రోడ్డు  మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. 38 కిలోమీటర్ల దూరంలో వున్న హసన్ ఇక్కడికి సమీప రైల్వే స్టేషన్.  హస్సన్ నుండి బెంగుళూర్, మంగుళూరు, మైసూర్ ల మధ్య రాష్ట్ర రవాణా బస్సులు కూడా  పుష్కలంగా ఉన్నాయి.

Please Wait while comments are loading...