Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బేలూర్ » ఆకర్షణలు » చెన్నకేశవ ఆలయం

చెన్నకేశవ ఆలయం, బేలూర్

3

బేలూర్ లోని అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం తప్పక సందర్శించదగినడి. ఈ దేవాలయం మృదువైన సున్నపురాయిని  ఉపయోగించి నిర్మించారు.  ఈ ఆలయము, విష్ణువు యొక్క ఒక అవతారము  ఐన చెన్నకేశవ స్వామికి  అంకితం చేయబడినది.

ఈ ఆలయం హొయసల కాలమునకు  చెందినది  మరియు వివిధ డిజైన్లకు తార్కాణంగా ఉన్న 48  శిల్ప స్తంభాలను కలిగి ఉంటుంది.1117 లో తాలక్కాడ్  యుద్ధ సమయంలో, ఈ మహానిర్మాణాన్ని  చోళులపై తన విజయానికి చిహ్నంగా   హోయసల  విష్ణువర్ధనుడు కట్టించాడు. పర్యాటకులు పురాణాల్లోని అనేక గాధలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను చూడవచ్చును. వీటితో పాటు, వివిధ  రంగులలో చెక్కిన నవ యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా  ఉన్నాయి.

అంతేకాక ఆలయం వరండ  లోపల అనేక ఇతర ఆలయాలు నిర్మించబడి ఉన్నాయి.ఈ దేవాలయలోని అనేక శిల్పాలలో అనేక రకాలైన ఆభరణాలు,పైకప్పులు, జంతువులు, పక్షులు, ద్వారాలు  మరియు అనేక రకాలైన ఇతర చిత్రాలను చూడవచ్చును . పర్యాటకులు  ఆలయం యొక్క ప్రవేశద్వారం వద్ద  ఒక పుష్కరణిని (మెట్లబావి)  కూడా చూడవచ్చు. విజయనగర సామ్రాజ్యం రోజులలో ఈ  ఆలయం యొక్క రాజగోపురాలు  నిర్మించబడ్డాయి.  ఆలయం యొక్క అంతర్భాగంలోనే కప్పే  చేన్నిగరాయ ఆలయం, మరియు లక్ష్మి దేవీకి  అంకితం చేసిన ఒక చిన్న కట్టడము  కూడా ఉన్నాయి.  

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu