సావన్ దుర్గ - వేచివున్న సాహస కార్యాలు

సావన్ దుర్గ - ఈ ప్రాంతంలో కల రెండు ఎత్తైన కొండలు, దేవాలయాలు మరియు ప్రకృతి దృశ్యాలు ఈ ప్రదేశాన్ని తప్పక చూడదగిన ప్రదేశంగా నిర్ధారిస్తాయి. ఈ పట్టణం బెంగుళూరు నగరానికి 33 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశానికి ఇండియాలో ఎక్కడినుండైనా సరే తేలికగా చేరుకోవచ్చు.  కొండలు మరియు కోటలగురించి చెప్పాలంటే....సావన దుర్గ అక్కడి కొండలైన కరిగుడ్డ మరియు బిలిగుడ్డల కారణంగా ప్రసిద్ధి కెక్కింది. కరిగుడ్డ అంటే నల్లకొండ అని, బిలి గుడ్డ అంటే తెల్ల కొండ అని అర్ధంగా చెపుతారు. ఈ కొండలు దక్కన్ పీఠభూమికి సుమారు 1226 మీటర్ల ఎత్తున ఉన్నాయి. గట్టి రాళ్ళు, గ్రానైట్, లేటరైట్ లతో ఈ కొండలు ఎక్కేందుకు చాలా కష్టపడాలి. కొన్ని పరికరాల సహాయంతో పైకి ఎక్కి అలసిపోవలసిందే. కాని సాహస క్రీడాభిమానులు అధిరోహణ విలువైనదని భావిస్తారు. కొండల పైభాగంలో పురాతన కోట శిధిలాలుంటాయి.  

రాక్ క్లైంబింగ్ లేదా ట్రెక్కింగ్ పట్ల ఆసక్తి లేనివారు వీరభద్రేశ్వర స్వామి మరియు నరసింహ స్వామి దేవాలయాలు దర్శించవచ్చు. ఈ దేవాలయాలు కొండ కింది భాగంలోనే ఉన్నాయి. చుట్టూ ఉంటే సీనరీలు అద్భుతంగా ఉంటాయి. నడక సాగిస్తే ఎన్నో అరుదైన చెట్లను, పిట్టలను చూసి ఆనందించవచ్చు. చరిత్ర పరిశోధకులకు కావలసినన్ని కప్పబడిన ప్రదేశాలున్నాయి.  

బెంగుళూరు, మాగడి ప్రదేశాలనుండి అనేక బస్సులు సావనదుర్గ సమీపం వరకు ఉన్నాయి. జర్నీ సమయం రెండు గంటలు మాత్రమే. మాగడినుండి సావన్ దుర్గకు ఆటోలు, స్ధానిక బస్సులలో కూడా చేరవచ్చు.   

Please Wait while comments are loading...