హొన్నెమర్దు - సాహస క్రీడాకారులకు పరీక్షా ప్రదేశం

సాహస క్రీడలు, నీటి క్రీడలు బాగా ఇష్టపడేవారికి హొన్నెమర్దు ప్రదేశం ఎంతో బాగుంటుంది. హొన్నె మర్దు గ్రామం ఎంతో చిన్నది. ఇది హొన్నెమర్దు రిజర్వాయర్ సమీపంలో ఏటవాలు కొండలపైగల ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం షిమోగా జిల్లాలో ఉంది. బెంగుళూరుకు షుమారుగా 379 కి.మీ.ల దూరం ఉంటుంది.

ప్రదేశాన్ని గురించిన కొన్ని వాస్తవాలు హొన్నెమర్దు అనే పేరు హొన్నె చెట్టు నుండి వచ్చింది. అయితే, కాని దీనికి ప్రాంతాన్నిబట్టి  ఖచ్చితమైన అర్ధం చెప్పాలంటే బంగారు సరస్సు అని చెప్పాలి. వాస్తవానికి ఈ ప్రదేశం షరావతి నది బ్యాక్ వాటర్స్ లేదా వెనుక నీటివైపుగా ఉంది. హొన్నెమర్దులో పెద్ద ఆకర్షణ అంటే ఈ ఊరు ఒక ద్వీపంవలే రిజర్వాయర్ మధ్యలో ఉంది. రాత్రి బసకు సౌకర్యాలు ఉంటాయి. తాజానీరు, స్విమ్మింగ్ పూల్ మరియు పెద్ద అటవీ ప్రదేశం అన్నీ ఇక్కడకు వచ్చే పర్యాటకులను ర్యాఫ్టింగ్, స్విమ్మింగ్, ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలు ఆచరించేలా చేస్తాయి. అడవీ భాగాలలో కాలినడక ఎన్నో రకాల పక్షులను చూపుతుంది.  

జోగ్ ఫాల్స్ లేదా జోగ్ జలపాతాలు చూడకుండా హొన్నెమర్దు పర్యటన అసంపూర్తే. 829 అడుగుల ఈ జలపాతం షరావతి నదినుండి పడుతుంది. జోగ్ ఫాల్స్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డబ్బే ఫాల్స్ కూడా తప్పక చూడదగినవి.  హొన్నెమర్దు ప్రదేశానికి షిమోగా రైలు స్టేషన్ సమీపంగా ఉంటుంది. బెంగుళూరు నుండి కూడా చేరుకోవచ్చు. స్ధానిక రవాణా సదుపాయాలు అంటే, చిన్న నావలు, బస్సులు ఉంటాయి.  

Please Wait while comments are loading...