కార్వార్ - కొంకణ్ కోస్తా తీర మహారాణి

భారత ద్వీప కల్పానికి పడమటి తీరంలో గోవా నుండి 15 కిలో మీటర్లు, రాష్ట్ర రాజధాని బెంగుళూరు నుండి 520 కిలో మీటర్ల దూరంలో సహజ అందాల కార్వార్ పట్టణం నెలకొని ఉంది. ఉత్తర కన్నడ జిల్లాకు ఇది ప్రధాన పట్టణంగా ఉంది. చారిత్రాత్మక పట్టణం సుమారు 15వ శతాబ్దం నుండి కూడా ఇది వ్యాపార కేంద్రంగా ఉంది.  కార్వార్ సహజ ఓడరేవు. సమీపంలోని కేరళ రాష్ట్ర సుగంధ ద్రవ్యాల ఎగుమతులు దీనినుండే జరుగుతాయి. గతంలో పోర్చుగీస్, తర్వాత బ్రిటీష్, ఆ తర్వాత అరేబియన్లు, ఇపుడు ఇండియా నౌకాదళం ఈ ఓడరేవును ఎంతో లాభసాటిగా వినియోగించుకుంటున్నాయి.

కాళి రివర్ కార్వార్ ప్రాంతంలోనే అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇక్కడే సదాశివగౌడ కోట కూడా ఉంది. కాళీ రివర్ వంతెన పక్క కట్టపబడింది. ఈ నది, బ్రిడ్జి, కోట, కన్నులకింపైన కొబ్బరి చెట్లు మొదలైన సుందర అందాలు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి.

కార్వార్ పట్టణ కధనం పరిశీలిస్తే....కార్వార్ పట్టణంలో ముస్లింలు, క్రిస్టియన్ల సంఖ్య అధికంగా ఉంటుంది. ఒకప్పుడు దీనిని టిప్పు సుల్తాన్ పాలించాడు. ఇది గోవాకు సమీపంలో ఉండటం చేత, పోర్చుగీస్ మరియు బ్రిటీష్ పాలకుల సమయంలో అనేక మంది మతపర సంస్ధలు కూడా దీనిని దర్శించేవారు. ఇక్కడి ప్రజలలో 55 శాతంమంది కొంకణి భాష మాట్లాడతారు. కన్నడం వీరికి రాదు. వీరి వేష భాషలు గోవా ప్రజల వేష భాషలకు దగ్గరగా ఉంటాయి. దేశం మొత్తంలో ఇది మాత్రమే కొంకణ్ రాష్ట్రంగా చెప్పవచ్చు. కాని వీరు కర్నాటకలో భాగంగా ఉండటానికే ఇష్టపడతారు.  

కార్వార్ గురించి మరింత వివరంగా చెప్పాలంటే....ఈ ప్రాంతంలో ఓడరేవు కాక రెండు రకాల పరిశ్రమలున్నాయి. కొబ్బరి చెట్లు, సరుగుడు చెట్లు ఈ ప్రాంతంలో అధికంగా ఉండి పర్యాటకులకు స్వర్గాన్ని తలిపిస్తాయి. నీటి క్రీడలు స్విమ్మింగ్, స్నోర్ కెలింగ్, సర్ఫింగ్ డైవింగ్ వంటివి కార్వార్ బీచ్ లైన దేవ్ బాగ్, కూడి, కాజు బాగ్ లలో ప్రసిద్ధి దీనితో పర్యాటకులకు ఇది ఒక సాహస క్రీడల కేంద్రంగా తయారైంది.

ఈ ప్రాంతంలో ఎన్నో చారిత్రాత్మక దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఉన్నాయి. ప్రాచీన హస్త కళలు కూడా కలిగి ఉంది. ఇక్కడి దేవాలయాలలో ఎంతో శిల్పకళా నైపుణ్యం కనపడుతుంది.  

గత దశాబ్దంలో భారత నౌకాదళం తన స్ధావరాన్ని ఏర్పరచుకొంది. ఓడరేవులోకి ప్రజలను భధ్రతా కారణాలుగా అనుమతించటంలేదు. అయితే, ప్రతి సంవత్సరం నేవీ వీక్ లో మాత్రం నౌకాదళ సైనికులు ఈ సమయంలో ప్రజలను లోనికి అనుమతిస్తారు. అందమైన ఓడరేవును ఆనందించేందుకు అపుడు వీలు కలుగుతుంది. అనేక శతాబ్దాలనుండి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలనుండి కార్వార్ పర్యాటకులను ఆకర్షిస్తోంది.

Please Wait while comments are loading...