Search
  • Follow NativePlanet
Share

సిర్సి - తప్పక ఆనందించదగిన విహార ప్రదేశం

11

దట్టమైన పచ్చటి అడవులు, ఎత్తైన జలపాతాలు, పురాతన దేవాలయాలు అన్ని కలిపి ఉత్తర కర్నాటక జిల్లాలోని ఈ ప్రధాన వినోద ప్రదేశం సిర్సిని పర్యాటకులకు మరువలేని ఒక విహార స్ధలంగా చేస్తాయి. ఈ ప్రదేశం పడమటి కనుమల మద్య భాగంలో బెంగుళూరు నగరానికి సుమారు 407 కి. మీ. దూరంలో ఉంది.  

సిర్సిలో చూడదగినవి ఏమిటి?

ప్రకృతి అందాలు తనివితీరా చూసి ఆనందించవచ్చు. సిర్సి వద్ద డోనిహల్లనుండి అఘనాషిని నది మొదలవుతుంది. ఈ నది సిర్సి కొండలపై ప్రవహించి అద్భుత జలపాతాలు జారవిడుస్తుంది. సిర్సి లో అధిక వర్షాలు అక్కడి అడవులను మరింత అందంగా తయారు చేస్తాయి. వీటిలో అనేక వన్యప్రాణులు నివసిస్తాయి. వీటన్నిటితో సిర్సి ప్రదేశం గొప్ప పర్యాటక స్ధలంగా పేరుపడింది.  

ఇక్కడ ప్రసిధ్ధి చెందిన దేవాలయం అంటే 16వ శతాబ్దం నాటి మరికాంబ దేవాలయం. ఏటా జరిగే వేడుకలకు వేలాది భక్తులు వస్తారు. ఇక్కడ మహా గణపతి దేవాలయం ఉంది. భక్తులు తాము ఏ పని చేయాలన్నా ముందుగా వచ్చిఈ దేవాలయాన్ని  దర్శించుకుంటారు. గణపతి ఆశీర్వాదం ఉంటే నిరాశ చెందవలసిన అవసరం లేదంటారు. వారు కోరిన కోరికలు తీరిన వెంటనే అనుకున్న మొక్కుబడులు చెల్లిస్తారు.  ఈ ప్రదేశంలో మరో చూడదగ్గ ప్రాంతం బనవాసి, సహస్రలింగ మరియు ఊంఛల్లి జలపాతాలు. బనవసి పురాతన పట్టణం. ఒకప్పుడు కర్నాటక రాజధానిగా ఉండేది. సహస్రలింగలో వేలాది శివలింగాలు దట్టమైన అడవి మధ్య నదిలో ముణిగి ఉన్నాయి. సిర్సి చేరటం తేలికే. సమీప ఎయిర్ పోర్ట్ 100 కి.మీ.గా హుబ్లిలో ఉంది. రోడ్డు ప్రయాణం కూడా తేలిక.        

సిర్సి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సిర్సి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సిర్సి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సిర్సి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం - ప్రధాన ఉత్తర కన్నడ నగరాలు అయిన షిమోగా, ధార్వాడ్, ఉడిపిలనుండి సిర్సికి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ఎన్నో బస్సులను నడుపుతోంది. బస్ ప్రయాణం ఎంతో తేలికగా, సౌకర్యంగా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - సిర్సికి రైలు స్టేషన్ లేదు. కుంటా రైలు స్టేషన్ సమీప రైలు జంక్షన్. షుమారు 61 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడినుండి గోవా, మంగుళూరు, పాన్ జిం లకు రైళ్ళు నడుస్తాయి. కుంటా చేరిన వెంటనే అక్కడి నుండి సిర్సికి టాక్సీలు, క్యాబ్ లలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    సిర్సి ఎలా చేరాలి? విమాన ప్రయాణం - సిర్సి పట్టణానికి సమీపంగా ఉన్న హుబ్లీ విమానాశ్రయం దానిని దేశంలోని ఇతర నగరాలకు కలుపుతుంది. ఇది సిర్సికి 109 కి.మీ. ల దూరంలో ఉంది. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సిర్సికి 418 కి.మీ. దూరంలో ఉంది. ఇది దేశంలోని ప్రధాన నగరాలకు విదేశాలకు విమానాలు నడుపుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri