హొరనాడు - ప్రకృతి ప్రసాదించిన వరం

హొరనాడు పట్టణం గురించి ప్రధానంగా చెప్పాలంటే అక్కడి అన్నపూర్ణేశ్వరి దేవాలయం గురించి చెప్పాలి. అంతేకాక ప్రకృతి అందాలకు పరవశం చెందేవారు, ఆ మాత యొక్క ఆశీర్వాదం కోరేవారు తమ ఇంద్రియాలను సంతుష్టి పరచేటందుకు హొరనాడు తప్పక సందర్శించాల్సిందే. ఈపచ్చటి పట్టణం మల్నాడు ప్రాంతంలో చిక్కమగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం దట్టమైన అడవులచే కప్పబడి ఎంతో సారవంతమైన ప్రదేశాలు, లోయలు కలిగి ఉంది. ఈ ఆకర్షణలతో కూడిన హొరనాడు పట్టణం అంటే ఇష్టపడని వారుండరు.  

దేవాలయ పురాతన చరిత్ర - పకృతి అందాలే కాక, హొరనాడు పట్టణ సందర్శనలో మాత అన్నపూర్ణేశ్వరి దేవాలయం వంటివి కూడా ప్రతి ఒక్కరిని అక్కడకు ఆకర్షిస్తాయి. ఈ దేవత విగ్రహం బంగారంతో తయారు చేయబడి ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం సందర్శించిన యాత్రికులకు తమ జీవితంలో ఆహార కొరత ఉండదని నమ్ముతారు. ఇతిహాసాల మేరకు శివ భగవానుడు ఒకప్పుడు శపించబడగా, ఈ మాత ఆశీర్వాదాలతో ఆ శాపం వరంగా మారిందని కూడా చెపుతారు. ఈ దేవాలయం సందర్శించిన ప్రతి యాత్రికుడికి రుచికర ఆహారం మాత్రమేకాదు, చక్కగా నిద్రించేందుకు స్ధలంగూడా ఇవ్వబడుతుంది.

హొరనాడు సందర్శించేవారు సమీపంలోనే ఉన్న ఇతర దేవాలయాలు కూడా సందర్శించవచ్చు. శృంగేరి ఇక్కడకు 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హొర్నాడు వెళ్ళే మార్గంలో ధర్మస్ధల మరియు ఉడుపి క్రిష్ణ దేవాలయం కూడా సందర్శించవచ్చు.

హొరనాడు బెంగుళూరుకు 330 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి సమీప రైలు స్టేషన్ షిమోగా. ఈ పట్టణం స్ధానిక బస్ సర్వీసులతో తరచుగా కలుపబడి ఉంటుంది. సమీప విమానాశ్రయం మంగుళూరులో ఉంది.

Please Wait while comments are loading...