ధర్మస్ధల - మతపర సహనం కల ప్రదేశం

ధర్మస్ధల ప్రదేశానికి చారిత్రాత్మక మరియు మతపర విశేషతలున్నాయి. ఈ ప్రదేశం పడమటి కనుమల మధ్యలో నేత్రావతి నదీ తీరంలో ప్రశాంతవాతావరణంలో ఒక గ్రామం కలదు. ఈ గ్రామంలో  ఒక మంజునాధేశ్వర దేవాలయం ఉంది. మంజునాధేశ్వరుడు అంటే శివ భగవానుడే. ఈ దేవాలయం దాని బంగారు లింగానికి ప్రసిద్ధి.  

దేవాలయం గురించి చెప్పాలంటే.... మతపర సహనానికి  ధర్మస్ధల ప్రదేశాన్ని ఒక గొప్ప ఉదాహరణగా చెపుతారు. ఈ దేవాలయం దాని పురాతన కట్టడాలకు మాత్రమే కాదు మతపర సహనానికి కూడా ప్రసిద్ధి. ఈ దేవాలయాన్ని జైన మతస్ధులు నడుపుతారు. కాని ప్రతిరోజూ ఆ దేవాలయంలోని దేవునికి పూజలు మాత్రం  హిందూ పూజారులు చేస్తారు. ఈ గ్రామంలోని ఇతర ఆకర్షణలలో ఎనిమిది మంది జైన మందిరాలు మరియు 11 మీటర్ల ఎత్తున్న బాహుబలి విగ్రహం కూడా కనపడతాయి. ఈ విగ్రహాన్ని 175 టన్నుల బరువుకల ఒకే రాతితో నిర్మించారు.

ధర్మస్ధల పట్టణం అనేక పురాతన మత గ్రంధాలకు కూడా నిలయంగా ఉంటుంది.  పురావస్తు శాఖ వారు ఈ పురాతన గ్రంధాలను ఈ ప్రదేశంనుండి సేకరించి ఒక మ్యూజియంలో భద్రపరచారు. ఇక్కడే ఒక అద్భుతమైన కార్ల మ్యూజియం కూడా ఉంది. దానిలోని పురాతన కార్లు, కార్లను ఇష్టపడేవారికి ఎంతో ఆకర్షణగా కూడా ఉంటాయి.

ధర్మస్ధల బెంగుళూరుకు సుమారు 300 కి.మీ. ల దూరంలో ఉంది. ప్రయాణం తేలిక. ఉడుపి నుండి ధర్మస్ధల పట్టణం 100 కి.మీ.లు కాగా మంగుళూరు నుండి సుమారు 76 కి.మీ. ల దూరం ఉంటుంది. బెంగుళూరు నుండి ధర్మస్ధలకు షుమారు 6 గంటల సమయంలో ప్రయాణించవచ్చు.

Please Wait while comments are loading...