హొరనాడు వాతావరణం

హొరనాడు వాతావరణం హొరనాడు సందర్శించాలంటే అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఎంతో అనుకూలం. 

వేసవి

వేసవి (ఏప్రిల్ నుండి జూలై) - ఈ కాలంలో హొరనాడు ఎంతో వేడిగా, తేమ అధికంగా ఉండి అసౌకర్యంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు 30 గా ఉంటాయి. ఈ వేసవి నెలలలో పర్యాటకులు హొరనాడు సందర్శనకు ఇష్టపడరు.  

వర్షాకాలం

వర్షాకాలం (ఆగస్టు నుండి అక్టోబర్) - వేసవి తర్వాత వర్షాలు వచ్చేస్తాయి. ఈ ప్రాంతంలో వర్షపాతం అధికం. సందర్శన ఈ కాలంలో కష్టం అవుతుంది.  

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి మార్చి) - హొరనాడులో శీతాకాలం చల్లగాను, ఒక మోస్తరుగాను ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలుగాను గరిష్ట ఉష్ణోగ్రతలు 20 గాను ఉంటాయి. ఈ కాలంలో పర్యాటకులు అధిక సంఖ్యలో హొరనాడు సందర్శిస్తారు.