వన్య ప్రాణులపై ఆసక్తి కలవారు అంశి నేషనల్ పార్క్ తప్పక చూడాలి. ఇది కార్వార్ నుండి 60 కి.మీ. ల దూరం. ఈ పార్క్ షుమారు 340 చ. కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. సముద్ర మట్టానికి 200 మీ. నుండి 925 మీటర్ల వరకు ఉంటుంది. ఈ పార్క్ పడమటి కనుమల పర్యావరణంలో ఉంది దండేలి వైల్డ్ లైఫ్ శాంక్చువరీని రెండు ముక్కలు చేసి ఒక ముక్కను నేషనల్ పార్క్ గా చేశారు. జనవరి 2007 లో అంశి నేషనల్ పార్క్ ను ప్రాజెక్ట్ టైగర్ గా ప్రకటించారు. ఈ పార్క్ చూడాలంటే నవంబర్ మరియు జూన్ సమయం అనుకూలం. దీనిలో అనేక జంతువులు, బల్లులు, పక్షులు, చెట్లు ఉంటాయి.